అపోలో వైద్యుల లేటెస్ట్ బులెటిన్: నిలకడగా సాయి ధరమ్ హెల్త్ కండిషన్.. ఐసీయూలోనే చికిత్స!

Published : Sep 11, 2021, 10:24 AM ISTUpdated : Sep 11, 2021, 10:30 AM IST
అపోలో వైద్యుల లేటెస్ట్ బులెటిన్: నిలకడగా సాయి ధరమ్ హెల్త్ కండిషన్.. ఐసీయూలోనే చికిత్స!

సారాంశం

తాజా సమాచారం ద్వారా సాయి ధరమ్ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. ఆయన ప్రధాన శరీర అవయాలు సాధారణంగా పనిచేస్తున్నాయని చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయనకు ఇంకా స్పృహ వచ్చినట్లు  డాక్టర్స్ ప్రెస్ నోట్ లో వెల్లడించలేదు. 


నిన్న రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయి ధరమ్ తేజ్ హెల్త్ కండీషన్ పై అపోలో వైద్యులు లేటెస్ట్ బులెటిన్ విడుదల చేశారు. సాయి ధరమ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అన్ని ప్రధాన అవయవాలు సాధారణంగా పని చేస్తున్నాయి. ఐసీయూ విభాగంలో ఉంచి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నాము. డాక్టర్స్ పర్యవేక్షణ కొనసాగుతుండగా, నేడు మరి కొన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం... అని తెలుపుతూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. 

తాజా సమాచారం ద్వారా సాయి ధరమ్ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. ఆయన ప్రధాన శరీర అవయాలు సాధారణంగా పనిచేస్తున్నాయని చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయనకు ఇంకా స్పృహ వచ్చినట్లు  డాక్టర్స్ ప్రెస్ నోట్ లో వెల్లడించలేదు. అలాగే మరికొన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 


మరో వైపు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకొని నిన్న పవన్ కళ్యాణ్, చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ