మహేష్ 'మహర్షి'పై ఎన్నికల ఎఫెక్ట్..?

Published : Feb 15, 2019, 11:14 AM IST
మహేష్ 'మహర్షి'పై ఎన్నికల ఎఫెక్ట్..?

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమాపై ఎన్నికల ప్రభావం పడనుందా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమాపై ఎన్నికల ప్రభావం పడనుందా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, పీవీపి, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ధనవంతుడైన ఓ వ్యారవేత్త ఓ పల్లెకు రావడం, మహర్షిలా రావడం వంటి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు అదే సినిమాకు ఇబ్బందిగా మారబోతుంది.

ఎందుకంటే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే రాబోతుంది. ఏపీలో ఏప్రిల్ 20 నుండి 30 మధ్యలో లేదంటే ఏప్రిల్ 20 నుండి మే ఫస్ట్ వీక్ మధ్యలో ఎన్నికల హడావిడి ఉంటుందని అంటున్నారు. కీలకప్రచారం ఏప్రిల్ ఆఖరి వారంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఎన్నికల సమయంలో సినిమాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరు. పైగా ఈసారి ఏపీ ఎన్నికలు రసవత్తరంగా సాగున్నాయి. కాబట్టి అందరి దృష్టి ఎలక్షన్స్ పైనే ఉంటుంది. మరి అదే రోజుల సినిమా విడుదల చేసి రిస్క్ తీసుకుంటారా..? లేక డేట్ మారుస్తారా..? అనేది చూడాలి!

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?