
కొద్ది కాలం క్రితం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా వారి హారర్ వెబ్ సిరీస్ 'అన్య'స్ ట్యుటోరియల్' టీజర్ రిలీజైంది. అప్పటిదాకా ఈ టైటిల్ కూడా వినని వారు సైతం ఒక్కసారి ఆసక్తిగా చూసారు. ఆ తర్వాత ఇంట్రస్టింగ్ గా ఈ ప్రాజెక్టు రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. రెజీనా కెసాండ్రా మరియు నివేదితా సతీష్ ముఖ్య పాత్రధారులుగా రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్ ను బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా నిర్మిస్తుంది. ఆహా ఈ వెబ్ సిరీస్ తెలుగు మరియు తమిళ్ భాషలలో రిలీజ్ కు రంగం రెడీ అయ్యింది.
సైబర్ హారర్ థ్రిల్లర్ సిరీస్‌ను జూలై 1, 2022న ఆహా వీడియో లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అన్యస్ ట్యుటోరియల్, ఏడు ఎపిసోడ్‌ల సిరీస్‌కి పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌కు సౌమ్య శర్మ కథను అందించగా, విజయ్ కె చక్రవర్తి కెమెరా క్రాంక్ చేయగా, అరోల్ కొర్రేలి సంగీతం అందించారు. అభిమానుల కోసం ఆహా వారు ఈ వెబ్ సిరీస్ ను తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల చేయబోతున్నారు.
ప్రపంచం మొత్తం ఇప్పుడు డిజిటల్ దిక్కు అడుగులు వేస్తుంది. కానీ అదే డిజిటల్ రంగం అందరిని భయపెడితే? అదే అన్య'స్ ట్యుటోరియల్. అన్య (నివేదితా సతీష్) ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కావాలని ప్రయత్నిస్తుంది. రెజీనా కెసాండ్రా (మధు) కి తన చెల్లి అన్య ప్రొఫెషన్ అంటే నచ్చదు. కానీ ఒక రోజు మొత్తం మారిపోతుంది. ఎవరూ చూడని విధంగా సైబర్ ప్రపంచం మొత్తం భయపడుతుంది. అసలు ఎందుకు? అని తెలుసుకోవాలంటే ఆహా మరియు ఆర్కా మీడియా వారి 'అన్య'స్ ట్యుటోరియల్' చూడాల్సిందే.