అనుష్క సైలెన్స్ రోల్.. ఆర్ట్ లో హర్రర్

Published : May 27, 2019, 11:48 AM IST
అనుష్క సైలెన్స్ రోల్.. ఆర్ట్ లో హర్రర్

సారాంశం

టాలీవుడ్ స్వీటీ అనుష్క నెక్స్ట్ సైలెన్స్ అనే సినిమాతో రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇంగ్లిష్, హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు తెలుగులో నిశ్శబ్దం అనే టైటిల్ ను సెట్ చేశారు. రీసెంట్ గా సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 

హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్క ఒక ఆర్ట్ లవర్ గా కనిపిస్తుందట. ఇక మాధవన్ సంగీత ప్రియుడిగా సెల్లో ప్లేయర్ గా కనిపిస్తాడని సమాచారం. హారర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాగమతి కంటే హై రేంజ్ లో బయపెడుతుందని సమాచారం. 

ఆర్ట్ కి సంబందించిన కొన్ని సన్నివేశాలు సినిమాలో మంచి కిక్కిస్తాయని అలాగే భయాన్ని కూడా కలుగజేస్తాయని తెలుస్తోంది. అనుష్క వివిధ రూపాల్లో ప్రతి ఎపిసోడ్ లో ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కోనవెంకట్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ ఆర్టిస్ట్ మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. సినిమాను ఎక్కువగా అమెరికాలోనే షూట్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్
Venkatesh కోసం హీరోయిన్‌ ని సెట్‌ చేసిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా? ఐశ్వర్యా రాయ్‌కి పెద్ద షాక్‌