ఆ ట్రోల్స్ ను పట్టించుకోనవసం లేదు... దానికి వాళ్లు సమాధానం ఇచ్చారు కదా : అనుష్కశర్మ

Published : Aug 13, 2018, 06:27 PM ISTUpdated : Sep 09, 2018, 02:00 PM IST
ఆ ట్రోల్స్ ను పట్టించుకోనవసం లేదు... దానికి వాళ్లు సమాధానం ఇచ్చారు కదా :  అనుష్కశర్మ

సారాంశం

ఇటీవల టీం ఇండియా ఆటగాళ్లు లండన్‌లో భారత హై కమిషన్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ  హజరవ్వడాన్ని తప్పుబడుతూ నెటిజన్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

ఇటీవల టీం ఇండియా ఆటగాళ్లు లండన్‌లో భారత హై కమిషన్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ  హజరవ్వడాన్ని తప్పుబడుతూ నెటిజన్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ట్రోలింగ్‌పై అనుష్కశర్మ స్పందించారు. ఆమె నటించిన లేటేస్ట్‌ మూవీ ‘సూయి ధాగా’ మూవీ ట్రైలర్‌ విడుదలైన సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ గ్రూఫ్ ఫొటోపై ఇప్పటికే వివరణ ఇవ్వాల్సిన వాళ్లు ఇచ్చారు. అదంతా ట్రోలింగ్. ఇలాంటి విమర్శలపై నేను స్పందించను. వాటిని పెద్దగా పట్టించుకోను. జరిగిందేదో జరిగిపోయింది. అన్ని నిబంధనల ప్రకారమే జరిగాయి. ఇంత చిన్న విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని  స్పష్టంచేశారు. 

ఆ ఫొటోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ఆటగాళ్ల మధ్య కెప్టెన్‌ కోహ్లి పక్కన అనుష్క నిలబడటం అభిమానుల ఆగ్రహానికి తెప్పించింది. దీంతో వారు సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ ట్రోలింగ్‌ నేపథ్యంలో కోహ్లి, అనుష్కల తప్పేం లేదని బీసీసీఐ కూడా వివరణ ఇచ్చింది.

 

PREV
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది