
నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా నటించిన `సాహసం శ్వాసగా సాగిపో` చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైంది మంజిమా మోహన్(Manjima Mohan). తెలుగులో రెండు సినిమాలు చేసిన ఈ భామ ఇప్పుడు మలయాళం, తమిళంకే పరిమితమైంది. అయితే అవకాశాలు కూడా ఒకటి అర దక్కించుకుంటూ నటిగా రాణిస్తుంది. అయితే సినిమాల్లో కంటే ప్రేమ కథ వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది మంజిమా మోహన్. ఆమె సీనియర్ హీరో కార్తీక్ కుమారుడు యంగ్ హీరో గౌతం కార్తీక్ (Gautam Karthik)తో ప్రేమలో పడినట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అటు సోషల్ మీడియాలో, వెబ్ సైట్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ఆమె గౌతం కార్తీక్ ప్రేమని అంగీకరించిందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట మ్యారేజ్‌కి సిద్ధమైందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా దీనిపై హీరోయిన్ మంజిమా మోహన్ స్పందించారు. గౌతంతో ప్రేమకి సంబంధించి ఆమె వివరణ ఇచ్చారు. ఈ వార్తలను కొట్టిపారేసిన మంజిమా తాను `గౌతం కార్తీక్ ప్రేమని అంగీకరించలేద`ని స్పష్టం చేసింది.
ఇంకా ఆమె చెబుతూ, తన జీవితంలో జరిగే కీలకమైన విషయాలను నేను ఎప్పుడూ దాచిపెట్టలేదని, చిన్న వియమైనా సరే ఓపెన్‌గా వెల్లడిస్తానని పేర్కొంది. తన జీవితంలో అత్యంత కీలకమైన పెళ్లి విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏముందంటూ ఫైర్ అయ్యింది. నిజానికి నేను, గౌతం పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలు తన మనస్సుకి బాధ కలిగించాయని పేర్కొంది. అయినా వాటిని పట్టించుకోలేదని, కానీ ఈ వార్తలు చూశాక తన తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారోనన్న భయం వేసిందని చెప్పింది మంజిమా. దేవుడి దయవల్ల వారు కూడా సీరియస్‌గా తీసుకోవాలని, ఇకపై ఇలాంటి వార్తలకు పుల్‌స్టాప్ పెట్టాలని పేర్కొంది మంజిమా మోహన్.
మలయాళ వెటరన్ సినిమాటోగ్రాఫర్ విపిన్ మోహన్, డాన్సర్ కలమందలం గిరీజల కుమార్తె మంజిమా మోహన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మంజిమా 2015లో `ఓరు వడక్కన్ సెల్ఫీ` చిత్రంతో హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైంది. ఆ తర్వాత ఏడాది `సాహసం శ్వాసగా సాగిపో` చిత్రంతో అటు తమిళంలోకి, ఇటు తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నాగచైతన్యతో జోడీ కట్టింది. ఈ సినిమా సక్సెస్ కాలేకపోవడంతో తెలుగులో ఆఫర్స్ రాలేదు. కేవలం తమిళంకే పరిమితమైన ఈ భామ మధ్యలో `ఎన్టీఆర్`బయోపిక్‌లో నారా భువనేశ్వరి పాత్రలో మెరిసింది. ఇక గౌతం కార్తీక్, మంజిమ `దేవరకట్టం` అనే తమిళ సినిమాలో కలిసి నటించారు.