'ఆకు మెట్టె'పై అనుష్క క్లారిటీ!

By Udayavani DhuliFirst Published Oct 30, 2018, 12:56 PM IST
Highlights

దక్షిణాది అగ్ర కథానాయికలలో ఒకరైన అనుష్క పెళ్లి చేసుకోబోతుందంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఏమిటంటే.. అనుష్క ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక ఫోటోని పోస్ట్ చేసింది. కాలికి ఆకులతో మెట్టె పెట్టుకున్నట్లుగా ఉన్న ఆ ఫోటోకి క్యాప్షన్ అవసరం లేదని క్యాప్షన్ ఇచ్చింది. 

దక్షిణాది అగ్ర కథానాయికలలో ఒకరైన అనుష్క పెళ్లి చేసుకోబోతుందంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఏమిటంటే.. అనుష్క ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక ఫోటోని పోస్ట్ చేసింది.

కాలికి ఆకులతో మెట్టె పెట్టుకున్నట్లుగా ఉన్న ఆ ఫోటోకి క్యాప్షన్ అవసరం లేదని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు ఆమె పెళ్లికి రెడీ అవుతోందని అనుకున్నారు. అనుష్క పెట్టిన పోస్ట్ పై రకరకాలుగా స్పందించారు. ఆమె పుట్టినరోజు కానుకగా గుడ్ న్యూస్ చెబుతుందని ఎదురుచూశారు.

అయితే ఈ ఫోటోకి తన పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది అనుష్క. అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ తన శరీర బరువు తగ్గించుకోవడం కోసం నార్వేలోని ఓ ప్రకృతి వైద్యశాలలో చేరింది. ఇక్కడ నాచురోపతి ట్రీట్మెంట్ ద్వారా బరువు తగ్గిస్తారు.

దట్టమైన అడవుల్లో ఉండే ఈ వైద్యశాలలో ఖాళీ సమయాల్లో సరదాగా తిరుగుతూ ఉండగా.. ఆమె కాలికి తగిలిన తీగను ఫోటో తీసి పోస్ట్ చేసిందట. ఇది చూసిన అభిమానులు అనుష్క పెళ్లికి సిద్ధమని భావించారు. ఈ ఫోటోపై రకరకాల కథనాలు కూడా వెలువడ్డాయి!

సంబంధిత వార్త.. 

వైరల్ అవుతోన్న అనుష్క ఇన్స్టాగ్రామ్ ఫోటో..!

click me!