17 ఏళ్లకే క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొని, ఇండస్ట్రీని వదిలేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : Oct 30, 2025, 03:25 PM IST
Madalsa Sharma

సారాంశం

Madalsa Sharma Casting Couch Experience 17 ఏళ్ల వయసులో క్యాస్టింగ్ కౌచ్ ను ఫేస్ చేసింది  హీరోయిన్ మదాలస శర్మ. సౌత్ ఇండస్ట్రీలో చేదు అనుభవం ఎదుర్కొన్న ఆమె.. మళ్లీ అటు వైపు చూడలేదు. 

బాలీవుడ్ తో పాటు, సౌత్ లో కూడా  పాపులర్ అయిన  నటి మదాలస శర్మ. ఆమె హిందీ సినిమాలు, టెలివిజన్‌లో పనిచేయడానికి ముందు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసింది.  అయితే,  ఆ సమయంలో ఆమెకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది. ఆ చేదు అనుభవం తర్వాత సౌత్ ఇండస్ట్రీని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించింది. 

సౌత్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ 

కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అనే విషయాన్ని మదాలస వివరించింది. ఆమె మాట్లాడుతూ, ‘అక్కడ నాకు కొన్ని చెడు  అనుభవాలు ఎదురయ్యాయి.  నేను ఆ దారిలో ముందుకు వెళ్లలేనని నాకు అనిపించింది. క్యాస్టింగ్ కౌచ్ లాంటివి అన్నిచోట్లా ఉంటాయి, కానీ సౌత్‌లో నాకు కొంచెం నిరాశ ఎదురైంది. పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు, కానీ ఒక సంభాషణ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అప్పుడు నా వయసు 17 ఏళ్లు. నాకు ఇబ్బందిగా అనిపించగానే అక్కడి నుంచి బయటకు వచ్చేసి, ఇక ముంబైకి తిరిగి వెళ్ళిపోవాలని నాకు నేనే అనుకున్నాను ‘’  అని ఆమె అన్నారు. 

ఇండస్ట్రీలో గుర్తింపు ఎలా వచ్చింది

మదాలస  మాట్లాడుతూ, 'ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది, దాన్ని చేరుకోవాలని అనుకుంటారు. నాకు కూడా ఒక లక్ష్యం, ఆశయం ఉన్నాయి, కానీ వాటిని నాపై ఆధిపత్యం చెలాయించనివ్వను. నేను ప్రశాంతగా ఉండాలి అనుకుంటాను… ఏం కావాలో, ఏమి వద్దో నాకు తెలుసు. ప్రతిదానికీ ఒక వెల ఉంటుంది.. నా నిర్ణయాలు ఎప్పుడూ ఈ ఆలోచన ఆధారంగానే తీసుకుంటాను.' అని ఆమె అన్నారు.  మదాలస శర్మ 2009లో తెలుగులో  'ఫిట్టింగ్ మాస్టర్' సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'శౌర్య', 'డోవ్', 'సూపర్ 2' వంటి అనేక సినిమాల్లో నటించింది. వీటితో పాటు కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా పనిచేసింది, కానీ ఆమెకు అసలైన గుర్తింపు 'అనుపమ' టీవీ షోతో వచ్చింది. మదాలస 2018లో మిథున్ చక్రవర్తి కొడుకు మహాఅక్షయ్ చక్రవర్తిని పెళ్లి చేసుకుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద