నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు... చెప్పు దెబ్బలాంటి సమాధానం ఇచ్చిన అనుపమ!

Published : Jun 11, 2023, 03:58 PM IST
నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు... చెప్పు దెబ్బలాంటి సమాధానం ఇచ్చిన అనుపమ!

సారాంశం

మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ని కించపరుస్తూ ఓ నెటిజన్ అవమానకర కామెంట్ చేశాడు. ఆ నెటిజెన్ కి సుతిమెత్తగా అనుపమ చురక అంటించింది.   

సోషల్ మీడియాలో హీరోయిన్స్ కి వేధింపులు వెరీ కామన్. మనం ఎవరికీ తెలియదు. ఎవరూ ఏమీ చేయలేరనే విశ్వాసంతో నోటికి వచ్చింది మాట్లాడేస్తారు జనాలు. చెత్త కామెంట్స్, బూతు పోస్ట్స్ పెడుతుంటారు. సోషల్ మీడియా నెగిటివిటీ, హేట్, ట్రోలింగ్ అతిపెద్ద సమస్యగా మారింది. దీన్ని కంట్రోల్ చేసేందుకు చట్టాలు ఉన్నప్పటికీ ఎవరూ భయపడటం లేదు. తాజాగా ఓ నెటిజెన్స్ అనుపమ ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా కామెంట్స్ చేశాడు. 

అనుపమ నువ్వు స్టార్ హీరోయిన్ కాదు. చెప్పాలంటే నువ్వు హీరోయిన్ మెటీరియలే కాదు. అందుకే నీకు పెద్ద హీరోల పక్కన అవకాశాలు రావడం లేదంటూ ఎద్దేవా చేశాడు. సదరు నెటిజెన్ కామెంట్ కి సహనంగా సమాధానం చెప్పిన అనుపమ అంతర్లీనంగా చురకలు అంటించింది. అనుపమ స్పందిస్తూ... అవును నిజమే నేను హీరోయిన్ కాదు. నేను కేవలం నటిని, అని అనుపమ కామెంట్ పోస్ట్ చేశారు. హీరోయిన్ అనిపించుకోవడం కంటే నటి అనిపించుకోవడం గొప్ప విషయమని అనుపమ పరోక్షంగా చెప్పారు. 

ప్రస్తుతం అనుపమ డీజే టిల్లు సీక్వెల్ గా తెరకెక్కుతున్న డీజే స్క్వేర్ మూవీలో నటిస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కానుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించారు. గత ఏడాది అనుపమకు కార్తికేయ 2 తో బ్రేక్ వచ్చింది. ఆ చిత్రం భారీ విజయం సాధించింది. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ తో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో అనుపమ నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?