రాంచరణ్ సినిమాపై అనుపమ కామెంట్.. అలా నటించలేనేమో!

Published : Jul 26, 2019, 08:45 PM IST
రాంచరణ్ సినిమాపై అనుపమ కామెంట్.. అలా నటించలేనేమో!

సారాంశం

మలయాళీ సూపర్ హిట్ ప్రేమమ్ చిత్రంతో గుర్తింపు పొందిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులోకి అడుగుపెట్టి అవకాశాలు దక్కించుకుంది. అనుపమ తెలుగులో అ..ఆ, శతమానం భవతి లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అనుపమ నటిస్తున్న చిత్రం రాక్షసుడు. 

మలయాళీ సూపర్ హిట్ ప్రేమమ్ చిత్రంతో గుర్తింపు పొందిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులోకి అడుగుపెట్టి అవకాశాలు దక్కించుకుంది. అనుపమ తెలుగులో అ..ఆ, శతమానం భవతి లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అనుపమ నటిస్తున్న చిత్రం రాక్షసుడు. బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

విడుదల సమయం దగ్గరపడుతుండటంతో అనుపమ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ పలు ఆసక్తికర విషయాలని పంచుకుంది. గత ఏడాది రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం టాలీవుడ్ రికార్డులని బ్రేక్ చేసింది. 

ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట అనుపమనే అనుకున్నారు. కానీ చివరకు ఈ చిత్రం సమంత చేతుల్లోకి వెళ్ళింది. రంగస్థలం చిత్రం దూరమైనందుకు అనుపమ పలు సందర్భాల్లో బాధపడింది. తాజాగా రంగస్థలం చిత్రం గురించి మాట్లాడుతూ.. ఆ చిత్రంలో అవకాశం కోల్పోవడం బాధగానే ఉంది. డేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురుకావడం వల్లే అలా జరిగింది. కానీ సమంత చాలా బాగా నటించిందని, ఆమెలా తాను నటించలేకపోయి ఉండేదాన్నేమో అని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్