ఇప్పటికైనా అనుపమ కోరిక తీరేనా?

Published : Aug 06, 2019, 05:53 PM IST
ఇప్పటికైనా అనుపమ కోరిక తీరేనా?

సారాంశం

  మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఎలాంటి కథలో అయినా ఇట్టే సెట్టైపోతుంది. ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ భామ మొన్నటివరకు పాజిటివ్ లెవెల్లో కొనసాగింది. అఆ - తెలుగు ప్రేమమ్ అలాగే శతమానం భవతి సినిమాలు ఈ నటికి మంచి క్రేజ్ తీసుకొచ్చాయి.

మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఎలాంటి కథలో అయినా ఇట్టే సెట్టైపోతుంది. ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ భామ మొన్నటివరకు పాజిటివ్ లెవెల్లో కొనసాగింది. అఆ - తెలుగు ప్రేమమ్ అలాగే శతమానం భవతి సినిమాలు ఈ నటికి మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. అవకాశాలు కూడా అదే తరహాలో వచ్చాయి. 

కానీ మధ్యలో కొన్ని సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో అవకాశాలు తగ్గాయి. చివరికి రాక్షసుడు సినిమాతో ఎలాగోలా సక్సెస్ అందుకుంది. ఈ సినిమా కూడా ప్లాప్ అయితే బేబీ పరిస్థితి ఎలా ఉండేదో చెప్పడం కష్టమే. ఇకపోతే తేజ్ ఐ లవ్ యూ సినిమా తరువాత ఒక స్టార్ హీరో సరసన నటించే అవకాశం రాగా ఎందుకో అమ్మడిని ఆ హీరో పెండింగ్ లిస్ట్ లో పెట్టాడట. ఇక ఇప్పుడు సక్సెస్ రావడంతో ఆ హీరో అనుపమను హీరోయిన్ గా ఒప్పుకున్నట్లు సమాచారం. 

అయితే రాక్షసుడు హిట్ టాక్ రాగాబే పదుల సంఖ్యలో బేబికి ఆఫర్స్ రాగ అందులో ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే ఒకే చేసినట్లు తెలుస్తోంది. మరో రెండిటిని పెండింగ్ లిస్ట్ లో పెట్టిందట. అయితే అను పాప చాలా రోజులుగా స్టార్ హీరోలతో వర్క్ చేయాలనీ ఆశపడుతోంది. రాక్షసుడు హిట్ కావడంతో పెద్ద సినిమా వస్తుందని ఒక సినిమాకు సరిపడ డేట్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది. మరి అమ్మడి ఆశ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి

PREV
click me!

Recommended Stories

IMDB మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్.. టాప్ 20లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే?
నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?