బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఎమోషనల్ పోస్ట్!

Published : Aug 26, 2019, 02:46 PM IST
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఎమోషనల్ పోస్ట్!

సారాంశం

తన భార్య కిరణ్ ఖేర్ కి విషెస్ చెబుతూ.. భావోద్వేగపు పోస్ట్ పెట్టారు అనుపమ్ ఖేర్. అనుపమ్ షేర్ చేసిన పెళ్లి ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ జంటకి సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఛండీగడ్ లో థియేటర్ కోర్స్ చదువుతున్న సమయంలో ప్రేమలో పడిన అనుపమ్, కిరణ్ 1985లో వివాహం చేసుకున్నారు.  అయితే అప్పటికే కిరణ్ కి బెర్రీ అనే వ్యాపారవేత్తతో పెళ్లి జరిగింది

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తాజాగా సోషల్ మీడియాలో తన పెళ్లి ఫోటో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చాడు.

''ప్రియమైన కిరణ్.. 34వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. జీవితంలో ఎక్కువ సమయం ఇద్దరో కలిసి గడిపాం. అప్పుడే 34 ఏళ్లు గడిచాయి.. నాకైతే నిన్ననే మన పెళ్లి అయినట్లు అనిపిస్తోంది. నీతో కలిసి జీవించిన, జీవిస్తోన్న ప్రతీ క్షణాన్ని ఎంతగానో ప్రేమిస్తా'' అంటూ తన భార్య కిరణ్ ఖేర్ కి విషెస్ చెబుతూ.. భావోద్వేగపు పోస్ట్ పెట్టారు. అనుపమ్ షేర్ చేసిన పెళ్లి ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ జంటకి సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఛండీగడ్ లో థియేటర్ కోర్స్ చదువుతున్న సమయంలో ప్రేమలో పడిన అనుపమ్, కిరణ్ 1985లో వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే కిరణ్ కి బెర్రీ అనే వ్యాపారవేత్తతో పెళ్లి జరిగింది. వీరికి సిఖిందర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అతడి నుండి విడిపోయిన కిరణ్.. అనుపమ్ ని పెళ్లి చేసుకొంది.

సిఖిందర్ కూడా వీరితోనే ఉంటున్నాడు. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కిరణ్‌ ఖేర్‌ 1996లో ‘సర్దారీ బేగమ్‌’ అనే సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించారు. ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీలో చేరారు. గత రెండు పర్యాయాలుగా పంజాబ్‌ రాజధాని చండీగఢ్‌ ఎంపీగా ఆమె ఎన్నికయ్యారు.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు