
మజ్ను, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రాల్లో నటించిన అను ఎమాన్యుయెల్ అతి తక్కువ కాలంలో ఏకంగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి జంట కట్టేస్తోంది. అది కూడా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. కెరియర్ ఆరంభంలోనే ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినందుకు అను ఎమాన్యుయేల్ సంబర పడిపోతోంది.
పవన్‌తో సినిమా చేసిన తర్వాత ఇక తనకి కావాల్సినంత గుర్తింపు వస్తుంది. టాప్ స్టార్స్ అందరూ తన పేరు కన్సిడర్ చేయక మానరు. ఈ చిత్రంలో అవకాశం రావడంతో ఇక కొత్త సినిమాలు కూడా సైన్ చేయడం లేదట. దీని తర్వాత తన జాతకం మారిపోతుందని, రేంజ్ పెరిగిపోతుందని అను తెగ సంబర పడిపోతతోంది.
నిన్న షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి ముందుగా పవన్, అనులపై సీన్లనే త్రివిక్రమ్ చిత్రీకరిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ స్పాట్లోనుంచి తన ఫోటోను ఇన్స్టా గ్రామ్ లో పెట్టి ఇందులో తాను ఎలా కనిపించబోతున్నా అనేది అను చెప్పకనే చెప్పింది. కళకళలాడిపోతున్న అను ఎమాన్యుయేల్ ఇకముందు అంతా ఎక్సయిటింగ్‌గా వుంటుందని పరవశంగా చెబుతోంది. మరి పవన్‌కళ్యాణ్‌తో ఛాన్స్ అంటే మాటలా.