
నేచురల్ స్టార్ అనే బిరుదుకి న్యాయం చేస్తున్నాడు నాని. రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ.. తన టాలెంట్ చూపించుకుంటున్నాడు. ఇక నానీ నటించిన తాజా సినిమా అంటే సుందరానికీ.. ఈమూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
విభిన్న కథలతో... డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో సినిమాలు చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇక నానీ హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా అంటే ... సుందరానికీ. ఆచార వ్యవహారాలు బాగా పాటించే ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా ఈ సినిమాలో నాని కనిపించనున్నాడు. నానీ ఫస్ట్ టైమ్ ఇలాంటి పాత్రలో కనించబోతున్నాడు.
ఇక అలాంటి ఆచారాలు పాటించే వ్యాక్తి విదేశాలకి వెళితే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక బ్రాహ్మణ యువకుడికీ .. క్రిస్టియన్ అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథనే ఈ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నాని జోడిగా మలయాళ బ్యూటీ నజ్రియా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అయిపోయి.. పోస్ట్ ప్రొడక్సన్ పనులు జరుగుతున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ ఒక రేంజ్ లో రీచ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేశారు టీమ్.
ఎంత చిత్రం .. ఎన్నేసి జ్ఞాపకాలు ఊపిరాడేదెలా.. , ఎంతమాత్రం ఊహలో లేని ఉత్సవాలలో మునిగి తేలా' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి - కీర్తన ఆలపించారు.
సినిమాలో సందర్భాన్ని బట్టి వస్తుంది గనుక ఏమైనా ఎక్కుతుందేమో చూడాలి. ఈ పాటను రిలీజ్ చేసినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలియజేశాడు నానీ. నదియా, రోహిణి, నరేశ్, సుహాస్ .. రాహుల్ రామకృష్ణ లాంటి స్టార్స్ ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్న ఈమూవీ కోసం నేచురల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.