
ఏళ్ల తరబడి ఆకలితో ఉన్న సింహం అడవిలో వేటకు దిగితే ఎలా ఉంటుందో... విక్రమ్(Vikram Movie) తో కమల్ హాసన్ బాక్సాఫీస్ ఊచకోత అలా ఉంది. సరైన కమర్షియల్ ఎంటర్టైనర్ పడితే తన్నెవరూ ఆపలేరని కమల్ (Kamal Haasan) నిరూపించాడు. బ్లాక్ బస్టర్స్ కొట్టే సత్తా ఇంకా ఉందంటూ నిరూపించారు. కేవలం ఐదు రోజుల్లో రూ. 200 కోట్ల వసూళ్లు సాధించిన విక్రమ్.. రన్ ముగిసే నాటికి రూ. 400 కోట్ల మార్క్ చేరుకునే అవకాశం కలదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. విడుదలైన అన్ని భాషల్లో విక్రమ్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది.
ఓవర్సీస్ లో కూడా విక్రమ్ ది అదే జోరు. యూఎస్ లో ఇప్పటికే $2 మిల్లియన్ వసూళ్లను దాటేసింది. విక్రమ్ తెలుగు రిలీజ్ హక్కులను హీరో నితిన్ కేవలం రూ. 7 కోట్లకు సొంతం చేసుకున్నారు. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కి చేరుకున్న ఈ మూవీ లాభాల వైపుగా దూసుకెళుతుంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో విక్రమ్ సాలిడ్ వసూళ్లు సాధిస్తుంది. ఏపీ/తెలంగాణలలో వీక్ డేస్ లో కూడా విక్రమ్ కి ప్రేక్షకులు పోటెత్తుతున్నారు.
థియేటర్స్ లో విక్రమ్ ఈ స్థాయిలో ఆడుతుండగా.. కొత్తగా విడుదలయ్యే చిత్రాలకు భారీ పోటీ ఎదురుకానుంది. ముఖ్యంగా నాని 'అంటే సుందరానికీ' మూవీపై విక్రమ్ ప్రభావం పడనుంది. అంటే సుందరానికి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, విక్రమ్ కారణంగా నాని సినిమాపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. ఒకవేళ నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే నాని చిత్రాన్ని ఎవరూ కాపాడలేరు. అంటే సుందరానికీ చిత్రం చూడాలనుకున్న ప్రేక్షకుల ఛాయిస్ విక్రమ్ అవుతుంది.
నాని (Nani) గత చిత్రం శ్యామ్ సింగరాయ్ ఇదే కారణంగా భారీగా నష్టపోయింది. పుష్ప, అఖండ చిత్రాల కారణంగా శ్యామ్ సింగరాయ్ వసూళ్లు కోల్పోయింది. ఆ చిత్రానికి వచ్చిన టాక్ కి భారీగా లాభాలు రావాల్సింది. పుష్ప, అఖండ చిత్రాలు బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి. వాటి రన్ థియేటర్స్ లో ఎక్కువ కాలం కొనసాగింది. దీంతో వాటి తర్వాత విడుదలైన శ్యామ్ సింగరాయ్ నష్టపోవాల్సి వచ్చింది. ఈ మధ్య నాని సినిమాలకు ఇది నిత్యకృత్యం అయిపోయింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలు కమర్షియల్ గా ఆడలేదు. మేజర్ (Major) సైతం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్న తరుణంలో నానికి కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.
వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకుడు కాగా.. నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అంటే సుందరానికీ (Ante Sundaraniki) చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.