అన్న ఎఫైర్.. చెల్లికి చిక్కులు!

Published : Aug 05, 2019, 09:09 PM IST
అన్న ఎఫైర్.. చెల్లికి చిక్కులు!

సారాంశం

అర్జున్ కపూర్ బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో. ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి నటుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. ఇటీవల అర్జున్ కపూర్ ఎఫైర్ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అర్జున్ కపూర్ ఎఫైర్ వల్ల అతడి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

అర్జున్ కపూర్ డేటింగ్ చేస్తోంది ఏ కుర్ర హీరోయినో అయితే ఇంత సమస్య ఉండేది కాదు. కానీ అర్జున్ కపూర్ ప్రస్తుతం రొమాన్స్ చేస్తోంది తనకన్నా వయసులో 12ఏళ్ళు పెద్దదైన ఐటెం భామ మలైకాతో. పబ్లిక్ గానే వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. వీరిద్దరి ఎఫైర్ గురించి ఆ మధ్యన అనిల్ కపూర్ కు కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. తాజాగా అర్జున్ కపూర్ సోదరికి మీడియా నుంచి మలైకాకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. 

మలైకా, అర్జున్ కపూర్ రిలేషన్ షిప్ గురించి మీడియా అర్జున్ సోదరి అన్షులాని ప్రశ్నించింది. దీనితో అన్షులా మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన సోదరుడి జీవితాన్ని ఆమెతో ముడిపెట్టి ప్రశ్నలు అడగొద్దు. ఆ విషయం గురించి నాకు తెలియదు. 

మా అన్న నాకు తండ్రి లాంటి వాడు. తన సోదరుడితో ఇలాంటి విషయాలు నేను ఎలా చర్చిస్తాను అని అన్షులా మీడియాని ప్రశ్నించింది. మలైకా అరోరా తన మాజీ భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత అర్జున్ కపూర్ తో రిలేషన్ మొదలుపెట్టింది. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?