స్వర్ణ ప్యాలెస్ మీద స్పందన: నోటీస్ జారీకి పోలీసులు రెడీ

Published : Aug 17, 2020, 08:17 AM ISTUpdated : Aug 17, 2020, 08:32 AM IST
స్వర్ణ ప్యాలెస్ మీద స్పందన: నోటీస్ జారీకి పోలీసులు రెడీ

సారాంశం

ఈ ఘటనకు బాధ్యుడైన రమేష్‌ చౌదరి తన బంధువు కావడంతో అంతటి సాహసం చేస్తాడా? తన తప్పుని సరిదిద్దుకుంటాడా? బాధితులకు అండగా నిలుస్తాడా? లేదా సైలైంట్‌ అయిపోతాడా ? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. 

రామ్‌ చాలా వరకు ప్రైవేట్‌ లైఫ్‌నే ఇష్టపడుతుంటాడు. ఆయన ఇతర హీరోల్లాగా బయట కనిపించే సందర్భాలు చాలా అరుదు. అసలు లేవనే చెప్పాలి. తన సినిమా రిలీజ్‌ టైమ్‌లో తప్ప ఇంకెప్పుడు ఆయన స్పందించరు. సామాజిక సమస్యలు, విపత్తుల టైమ్‌లో కూడా ఆయన రియాక్ట్ అయిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండరు. పూర్తిగా వివాదాలకు అతీతంగా ఉంటారు.  

కానీ ఉన్నట్టుండి ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌ అయ్యారు. తన బంధువుని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఆయన రియాక్ట్ అయ్యాడు. ఇటీవల విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్ని ప్రమాద దారుణానికి బాధ్యులైన రమేష్‌ ప్రసాద్‌ ఆసుపత్రి అధినే రమేష్‌ చౌదరి రామ్‌కి బాబాయ్‌ కావడం, ఆయనకు సపోర్ట్ చేస్తూ ట్వీట్‌ చేయడం పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. 

ఈ విషయంలో రామ్‌పై ఆయన అభిమానుల నుంచి కూడా నెగటివ్‌ రియాక్షన్‌ వచ్చింది. ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి  ఉందని, ఆచితూచి స్పందిస్తే బాగుండనే అభిప్రాయం ఆయన అభిమానుల నుంచి వస్తోంది. ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో రామ్‌ని నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. రామ్‌చేసిన ట్వీట్‌ జనాల్లో కూడా రాంగ్‌ ఇంప్రెషన్‌ పడేలా చేస్తుంది. 

అయితే మొత్తానికి రామ్‌ రియలైజ్‌ అయ్యాడు. తాను చేసిన మిస్టేక్‌ ఏంటో తెలుసుకున్నాడు. ఇకపై స్పందించనని తను వివరణ కూడా ఇచ్చాడు. కానీ ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తనపై రావాల్సినంత బ్యాడ్‌ నేమ్‌ వచ్చింది. ఇప్పుడు ఆయన చేయాల్సింది దోషులకు వ్యతిరేకంగా పోరాడటం. ఈ ఘటనలో దోషులను శిక్షించాలని ట్వీట్లు చేయాలి. కానీ ఈ ఘటనకు బాధ్యుడైన రమేష్‌ చౌదరి తన బంధువు కావడంతో అంతటి సాహసం చేస్తాడా? తన తప్పుని సరిదిద్దుకుంటాడా? బాధితులకు అండగా నిలుస్తాడా? లేదా సైలైంట్‌ అయిపోతాడా ? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. మరి ఈ విషయంలో ఆయన ఏం చేస్తాడో చూడాలి. 

ఇక గతేడాది `ఇస్మార్ట్ శంకర్‌`తో అదిరిపోయే హిట్‌ని అందుకుని పూర్వ వైభవాన్ని సంపాదించుకున్న రామ్‌ ప్రస్తుతం సస్పెన్స్ యాక్షన్‌ థ్రిలర్‌ `రెడ్‌`లో నటిస్తున్నాడు. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రామ్‌ రెండు భిన్న కోణాలున్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు