అంకితా ఫ్లాట్‌, సుశాంత్‌ ఫ్లాట్‌ వేర్వేరా?.. అంకితా బ్యాంక్‌ స్టేట్‌మెంట్లలో ఏముంది?

Published : Aug 15, 2020, 03:36 PM ISTUpdated : Aug 15, 2020, 03:40 PM IST
అంకితా ఫ్లాట్‌, సుశాంత్‌ ఫ్లాట్‌ వేర్వేరా?.. అంకితా బ్యాంక్‌ స్టేట్‌మెంట్లలో ఏముంది?

సారాంశం

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే తనపై వస్తోన్న ఆరోపణలపై స్పందించారు. తన ఫ్లాట్‌కి సంబంధించిన ఈఎంఐలు తానే చెల్లిస్తున్నానని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా ఆమె తన ఫ్లాట్‌ పత్రాలు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు పంచుకున్నారు. ఇకపై తనపై వచ్చే ఆరోపణలకు ముగింపు పడుతుందనుకుంటున్నానని తెలిపింది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తన మాజీ ప్రియురాలు అంకిత లోఖండేకి రూ.4.5కోట్లు విలువ చేసే ఫ్లాట్‌ కొనిచ్చాడని, దానికి సంబంధించి ప్రతినెల ఈఎంఐలు కూడా సుశాంత్‌ పే చేస్తున్నట్టు ఇటీవల ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. సుశాంత్‌ మరో మాజీ ప్రియురాలు రియాచక్రవర్తి ఈడీ విచారణలో ఈ విషయాలు వెల్లడించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
 
తాజాగా దీనిపై నటి అంఖిత లోఖండే స్పందించారు.. తన ఫ్లాట్‌కి సంబంధించిన ఈఎంఐలు తానే చెల్లిస్తున్నానని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా ఆమె తన ఫ్లాట్‌ పత్రాలు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు పంచుకున్నారు. ఇకపై తనపై వచ్చే ఆరోపణలకు ముగింపు పడుతుందనుకుంటున్నానని తెలిపింది.

ఆమె స్పందిస్తూ, రిజిస్ట్రేషన్‌, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు పంచుకుంటూ, ఇవి తన ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు అని తెలిపింది. `నా ఫ్లాట్‌ ఈఎంఐలు నేనే చెల్లిస్తున్నా. ఇంతకంటే ఇంకే చెప్పలేను` అని ట్వీట్‌ చేసింది. గతేడాది నుంచి తాను చెల్లిస్తున్న ప్రతి నెల ఈఎంఐ వివరాలను పంచుకుంది. ముంబయిలో ఉన్న మలాడ్‌లోగల ఫ్లాట్‌కి సంబంధించి సుశాంత్‌ 403 ఫాట్‌ కొన్నట్టు, అంకితా లోఖండే 404 ఫ్లాట్‌ కొన్నట్టుగా చూపించారు. ఈ లెక్కన రెండు వేర్వేరు అని అర్థమవుతుంది. 

ఇదిలా ఉంటే మరో మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి రూ15కోట్లు సుశాంత్‌ నుంచి కొట్టేసిందని సుశాంత్‌ తండ్రి కేసు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఈడీ అధికారులు గత వారం రోజులుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసుని అంకితా వైపు డైవర్ట్ చేయడానికి రియా ఇలా తప్పుడు సమాచారం ఈడీ అధికారులకు ఇచ్చిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి