`యానిమల్‌` రికార్డు నామినేషన్‌.. ఏకంగా 19 అవార్డులకు పోటీ..

Published : Jan 16, 2024, 08:42 PM IST
`యానిమల్‌` రికార్డు నామినేషన్‌.. ఏకంగా 19 అవార్డులకు పోటీ..

సారాంశం

సందీప్‌ రెడ్డి వంగా రూపొందించిన `యానిమల్‌` మూవీ సంచలన విజయం సాధించింది. తాజాగా ఇది 19 అవార్డుల కోసం పోటీపడుతుంది. రికార్డు నామినేషన్స్ పొందింది. 

గతేడాది వచ్చిన సంచలన చిత్రాల్లో `యానిమల్‌` మూవీ ఒకటి. సందీప్‌ రెడ్డి సృష్టించిన సంచలనానికి ఇది నిదర్శనంగా నిలిచింది. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసింది. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఏడు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. రెండు వందల కోట్ల బడ్జెట్‌తో వచ్చి, ఏకంగా ఏడు వందలు వసూలు చేయడం విశేషం. 

ఈ మూవీ ఇంకా థియేటర్లలో రన్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక అరుదైన రికార్డు సాధించింది. సరికొత్త రికార్డుకి శ్రీకారం చుట్టబోతుంది. ఈ మూవీ ఏకంగా 19 అవార్డుల కోసం పోటీ పడుతుంది. ఫిల్మ్ ఫేర్‌ అవార్డు కోసం ఈ మూవీ పోటీపడుతుంది. అయితే మేకర్స్ ఏకంగా 19 విభాగాలకు నామినేషన్స్‌ పంపించారు. 69వ ఫిల్మ్ ఫేర్‌ వేడుక త్వరలోనే జరగబోతుంది. దీనికోసం నామినేషన్లని స్వీకరిస్తుంది.  అందులో భాగంగా `యానిమల్‌` మూవీ ఏకంగా 19 విభాగాల్లో ఫిల్మ్ ఫేర్‌ అవార్డుకి పోటీ పడటం విశేషం. 

ఇందులో బెస్ట్ ఫిల్మ్, డైరెక్టర్‌,  యాక్టర్‌, సపోర్టింగ్‌ రోల్స్ లో నలుగురు, లిరిక్స్, మ్యూజిక్‌, ప్లే బ్యాక్‌ సింగర్‌ మేల్‌ విభాగంలో ఇద్దరు, బెస్ట్ స్క్రీన్‌ ప్లే,  బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్‌ డిజైన్‌, కాస్ట్యూమ్‌ డిజైన్‌, సౌండ్‌ డిజైన్‌, ఎడిటింగ్‌, యాక్షన్‌, వీఎఫ్‌ ఎక్స్ విభాగాల్లో ఇది ఫిల్మ్ ఫేర్‌కి పోటీ పడుతుండటం విశేషం. ఈ అవార్డు వేడుక జనవరి 27, 28న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరగనుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?
400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?