నాని `హాయ్‌ నాన్న`, నితిన్‌ `ఎక్ట్స్రా`పై `యానిమల్‌` దెబ్బ.. తల పట్టుకుంటున్న నిర్మాతలు..

Published : Nov 30, 2023, 10:59 AM ISTUpdated : Nov 30, 2023, 11:30 AM IST
నాని `హాయ్‌ నాన్న`, నితిన్‌ `ఎక్ట్స్రా`పై `యానిమల్‌` దెబ్బ.. తల పట్టుకుంటున్న నిర్మాతలు..

సారాంశం

నాని నటించిన `హాయ్‌ నాన్న`, నితిన్‌ నటించిన `ఎక్ట్స్రా` సినిమాలపై యానిమల్‌ మూవీ చాలా ప్రభావం చూపిస్తుంది. వాటిని పట్టించుకునే వాళ్లే లేరు.

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న `యానిమల్‌` సినిమా ఇప్పుడు ఇండియా వైడ్‌గా భారీ హైప్‌ నెలకొంది. ఒక్క ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించడం ఈ సినిమాపై హైపర్‌కి మరో కారణం. అలాగే నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, అనిల్‌ కపూర్‌,  బాబీ డియోల్‌  వంటి భారీ స్టార్‌ కాస్టింగ్‌తో ఈ మూవీ రూపొందుతుంది. 

డిసెంబర్‌  1న ఈ చిత్రం విడుదల కాబోతుంది. దీంతో గత వారం రోజలుగా ఈ మూవీ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. దీని హైప్‌ ముందు తెలుగు సినిమాలు డీలా పడిపోతున్నాయి. ముఖ్యంగా నాని నటించిన `హాయ్‌ నాన్న`, నితిన్‌ హీరోగా నటిస్తున్న `ఎక్ట్సా` చిత్రాలపై `యానిమల్‌` ఎఫెక్ట్ గట్టిగా ఉంది. ఈ సినిమాలకు హైపర్‌ రావడం లేదు. నాని చాలా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఏదో ఓ రకంగా ఈవెంట్‌లో మెరుస్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ ఈ మూవీ గురించి ఎవరూ చర్చించడం లేదు. నిన్న వైజాగ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ పెట్టినా దాని గురించి మాట్లాడుకునే వారే లేరు. 

ఇక `యానిమల్‌` ప్రభావం `ఎక్ట్సా`పై మరింతగా ఉంది. ట్రైలర్‌ రిలీజ్‌ అయినా ఈ సినిమాకి హైప్‌ రాలేదు. అసలు ఈ మూవీ  వస్తుందనే  విషయమే జనాలకు వెళ్లలేదు. పైగా పెద్దగా  ప్రమోషన్స్ లేవు. టీజర్‌,  ట్రైలర్స్ పెద్దగా ఆకట్టుకునేలా లేవు. శ్రీలీల వంటి హీరోయిన్‌ ఉన్నా ఈ సినిమాని పట్టించుకోకపోవడం గమనార్హం. నితిన్‌కి వరుసగా ఫ్లాప్‌లు ఉండటం కూడా హైప్‌ రాకపోవడానికి కారణమని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా బిజినెస్‌ కూడా కాలేదని అంటున్నారు. దీంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు నిర్మాతలు. 

మొత్తంగా డబ్బింగ్‌ మూవీ `యానిమల్‌` స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలపై ఇంతటి ప్రభావం చూపించడం ఆశ్చర్యపరుస్తుంది. దీనికి కారణం సందీప్‌ డైరెక్షన్‌ అని చెప్పొచ్చు. దీని ప్రభావం ఈ వీకెండ్‌ వరకు ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ఈ రెండు సినిమాలకు స్కోప్‌ ఉంటుంది.  ఆ సమయంలో  లేస్తే ఒక లెక్క, లేవకపోతే మరో లెక్క. ఏదేమైనా `యానిమల్‌` ప్రభావం ఈ రెండు సినిమాలపై గట్టిగానే  ఉంటుందని ట్రేడ్‌ వర్గాల  అంచనా. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే