మరోసారి 'సరిలేరు నీకెవ్వరు' కాంబినేషన్.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవిగో

By team teluguFirst Published Apr 29, 2022, 1:46 PM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు, వినోదాత్మక చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఘనవిజయం సాధించింది. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, వినోదాత్మక చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఘనవిజయం సాధించింది. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. దేశభక్తి అంశం, ఫన్ ఎలిమెంట్స్, మహేష్ ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. 

ఇదిలా ఉండగా మరోసారి సరిలేరు నీకెవ్వరు కాంబినేషన్ సెట్ కాబోతోంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. కాకపోతే ప్రస్తుతం మహేష్ బాబుకి ఉన్న కమిట్మెంట్స్.. అనిల్ రావిపూడికి ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాతే. 

మహేష్ సర్ తో నాకు మంచి రాపో ఉంది. మా కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం విజయం సాధించింది. ఎప్పటికప్పుడు నా ఐడియాలని మహేష్ సర్ తో షేర్ చేసుకుంటూ ఉంటా. మహేష్ సర్ తో మరో సినిమాకి వర్క్ చేసేందుకు స్క్రిప్ట్ పై వర్క్ మొదలు పెట్టాను. 

నాకున్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక.. మహేష్ సర్ కూడా తన తదుపరి చిత్రాలు ఫినిష్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఈ చిత్రం షురూ అవుతుంది అని అనిల్ రావిపూడి రివీల్ చేశారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

ఈ మూవీ పూర్తయ్యాక బాలయ్యతో సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే మహేష్ బాబు సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే రాజమౌళితో భారీ బడ్జెట్ చిత్రం ఉండబోతోంది. సో మహేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సెకండ్ మూవీకి ఇంకా చాలా సమయం పట్టొచ్చు. 

click me!