మహేష్ బాబుతో అనిల్ రావిపూడి మరో సినిమా..? అయ్యిందా..? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

By Mahesh Jujjuri  |  First Published Oct 14, 2023, 5:38 PM IST

సూపర్ స్టార్  మహేష్ బాబు నెక్ట్స్ మూవీ ఎవరితో.. ? రాజమౌళితో  జాయిన్ అవుతాడా..? లేక ఈలోపు మరో మూవీ చేస్తాడా..? అనిల్ రావిపూడితో మహేష్ సినినిమా ఎప్పుడు..? దర్శకుడు ఏమంటున్నాడు. 


సూపర్ స్టార్  మహేష్ బాబు నెక్ట్స్ మూవీ ఎవరితో.. ? రాజమౌళితో  జాయిన్ అవుతాడా..? లేక ఈలోపు మరో మూవీ చేస్తాడా..? అనిల్ రావిపూడితో మహేష్ సినినిమా ఎప్పుడు..? దర్శకుడు ఏమంటున్నాడు. 

ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. ఈసినిమా తరువాత మహేష్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తుంది. మహేష్ తో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఈసినిమా తో ఈసారి ఓరెండు మూడు ఆస్కార్ లు ఖాతాలో వేసుకోవాలి అనేది ఆయన టార్గెట్. ఈక్రమంలో దానికి తగ్గట్టుగానే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా గట్టిగా జరుగుతోంది. ఈక్రమంలో మహేష్ బాబు సినిమాపై క్రేజీ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. 

Latest Videos

మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈసినిమా అయిపోయే వరకూ చాలా టైమ్ పడుతుంది. ఇక అటు రాజమౌళి కూడా ఈ ఏడాదంతా..  మహేష్ సినిమా ప్రీప్రొడక్షన్ లో బిజీగా ఉండబోతున్నాడు. ఈక్రమంలో ఈలోపు మహేష్ మరో సినిమా చేస్తాడని టాక్ గట్టిగా నడిచింది. టాలీవుడ్ లో ప్రెజెంట్ మోస్ట్ సక్సెస్ ఫుల్ గా ఉన్నటువంటి స్టార్ దర్శకుల్లో ఇపుడు దసరా కానుకగా రిలీజ్ కి సిద్ధం అవుతున్న చిత్రం “భగవంత్ కేసరి” దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఒకరు. మరి అనీల్ నుంచి రానున్న ఈ చిత్రం కూడా మినిమమ్ గ్యారెంటీ రిపోర్ట్స్ తో వినిపిస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా విషయంలో ఓ క్లారిటీ అయితే ఇచ్చారు.

ఇది వరకే ఈ కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా సెన్సేషనల్ హిట్ అందుకోగా మళ్ళీ ఆ తర్వాత వీరి నుంచి మరో సినిమా అంటూ రీసెంట్ గానే ఓ బజ్ వైరల్ గా మారింది. అయితే ఈ రూమర్స్ పై అనీల్ క్లారిటీ ఇచ్చాడు. తనకి మహేష్ గారికి మరో సినిమా చేసేలా ఎంతో సాన్నిహిత్యం ఉందని కానీ మహేష్ గారి 29వ సినిమా తాను చేస్తున్నట్టుగా వచ్చిన వార్తలు అన్నీ అబద్దం అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. దీనితో అయితే ఈ క్రేజీ కాంబినేషన్ పై గత కొన్ని రోజులు కితం వచ్చిన వార్తలు ఫేక్ అని తేలిపోయింది.

click me!