ఇటీవల అనిల్‌ని కలిసిన పరశురామ్ సర్కారు వారి పాట క్యారక్టర్ ని చెప్పారని, అందులో విలన్ పాత్ర ఆయనకు బాగా నచ్చిందని అన్నారు. అంతేకాదు త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కోసం అనిల్ డేట్లు ఇవ్వనున్నట్లు టాక్ కూడా మొదలైంది. హిందీ మార్కెట్ కోసం దర్శక,నిర్మాతలు ఇలాంటి స్క్రీమ్స్ వేయటం కొత్తేమీ కాదు. అయితే ఈ సినిమాలో నటించటానికి అనీల్ కపూర్ అడిగిన మొత్తం నిర్మాతను షాక్ కు గురి చేసిందిట. ఆయన పది కోట్లు డిమాండ్ చేసారని వినికిడి. దాంతో వేరే ఆప్షన్స్ పరిశీలస్తున్నట్లు సమాచారం.
సరిలేరు నీకెవ్వరుతో ఈ ఏడాది మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాటలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రం గురించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయంలో నటించనున్నట్లు వార్తలు వస్తుండగా.. ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది. అదేంటంటే ఇందులో విలన్‌గా బాలీవుడ్ సూపర్‌స్టార్ అనిల్ కపూర్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాను ఆర్థిక నేరాల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కి్స్తుండటంతో ఈ సినిమాలో విలన్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
అయితే విలన్ పాత్రలో ఎవరిని తీసుకోవాలా అని చిత్ర యూనిట్ చాలా రోజుల నుండి తీవ్రంగా ఆలోచిస్తోంది.ఈ క్రమంలో పలువురు పేర్లు వినిపించినా కూడా ఇంకా ఎవరిని ఓకే చేయలేదు చిత్ర యూనిట్. ఇటీవల అనిల్‌ని కలిసిన పరశురామ్ సర్కారు వారి పాట క్యారక్టర్ ని చెప్పారని, అందులో విలన్ పాత్ర ఆయనకు బాగా నచ్చిందని అన్నారు. అంతేకాదు త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కోసం అనిల్ డేట్లు ఇవ్వనున్నట్లు టాక్ కూడా మొదలైంది. హిందీ మార్కెట్ కోసం దర్శక,నిర్మాతలు ఇలాంటి స్క్రీమ్స్ వేయటం కొత్తేమీ కాదు. అయితే ఈ సినిమాలో నటించటానికి అనీల్ కపూర్ అడిగిన మొత్తం నిర్మాతను షాక్ కు గురి చేసిందిట. ఆయన పది కోట్లు డిమాండ్ చేసారని వినికిడి. దాంతో వేరే ఆప్షన్స్ పరిశీలస్తున్నట్లు సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీపై అటు మహేష్ అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. కుటుంబ విలువలు, వినోదం, ప్రేమ అంశాల మేళవింపుతో ఈ సినిమా రూపుదిద్దుకోనున్నది. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రం కోసం బ్యాంక్ సెట్ ని రెడీ చేస్తున్నారు. ఈ సెట్ లో నెల రోజులు పాటు షూటింగ్ జరగనుంది.
ఈ సినిమా కాన్సెప్ట్ కూడా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూనే సాగనుంది. ఇక ఈ సినిమాలో మంచి యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ట్విస్ట్ లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అందుకు తగ్గట్లే గీతా గోవిందం స్దాయిలో.... అలాగే ఓ రొమాన్స్ ట్రాక్ కూడా ఉందని.. మహేష్ అభిమానులకు ఈ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ అంటున్నారు. చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు. ఈ లవర్ బాయ్ లుక్ కోసమే, మహేష్ తన హెయిర్ స్టైల్ ను కూడా కొత్తగా మార్చుకున్న విషయం తెలిసిందే.