ఒళ్లు గగుర్పొడిచేలా `నో ఎంట్రీ` ట్రైలర్.. నాలుగు కుక్కలు కలిస్తే..

Published : Feb 20, 2023, 08:14 PM IST
ఒళ్లు గగుర్పొడిచేలా `నో ఎంట్రీ` ట్రైలర్.. నాలుగు కుక్కలు కలిస్తే..

సారాంశం

నటి ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్రలో నటించిన `నో ఎంట్రీ `మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. అడవిలో కుక్కలతో చేసే పోరాటం నేపథ్యంలో సీగే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.  

`తడాఖా` చిత్రంతో టాలీవుడ్‌లో మెరిసి తెలుగు ఆడియెన్స్ ని అలరించింది ఆండ్రియా జెరెమియా. మరోవైపు కమల్‌ హాసన్‌తో నటించిన `ఉత్తమవిలన్‌`తోనూ తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. తమిళంలో వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ నటించిన లేటెస్ట్ మూవీ `నో ఎంట్రీ`. ఆర్‌ అళగు కార్తిక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జంబో సినిమాస్‌ బ్యానర్‌పై శ్రీధర్‌ అరుణాచలం నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది తమిళంలో రూపొందుతున్న ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్‌ చేయబోతున్నారు. 

సోమవారం విడుదల చేసిన తెలుగు ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. నాలుగు కుక్కలు కలిస్తే ఏనుగునైనా చంపేయగల శక్తి వాటి సొంతం. అదే వాటి బలం పెరిగితే, వాటి బలం పెంచేందుకు ఓ సైంటిస్ట్ చేసిన ప్రయోగం ఏమైంది? కుక్కల్లో పుట్టిన అతి భయంకరమైన వైరస్‌ మనుషులపై ఎలా దాడి చేసిందనే ఉత్కంఠభరిత సన్నివేశాల సమాహారంగా ఈ ట్రైలర్‌ సాగింది. చూడ్డానికి ఇది జాంబి జోనర్‌ మూవీలా ఉంది. కుక్కలు మనుషులను కరవడం, మనుషులు, మనుషులనే కరవడం వంటి సన్నివేశాలు సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తున్నాయి. ఇందులో ఆండ్రియా అదరగొట్టింది.

దట్టమైన అటవీ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్ళిన కొంత మంది స్నేహితులు అడవిలోని కొండ శిఖరంలో ఉన్న లగ్జరీ విల్లాలో బస చేస్తారు. ఆ ఇంటిని క్రూరమైన అడవి కుక్కలు చుట్టుముడతాయి. ఆ కుక్కల భారీనుండి వారు ఏ విధంగా తప్పించుకున్నారనేది ఈ చిత్ర కథగా తెలుస్తోంది. ఎంతో థ్రిల్లింగ్‌గా, రోమాలు నిక్కబొడుచుకునేలా ఇందులోని సన్నివేశాలను తెరకెక్కించినట్టు దర్శకుడు ఆర్‌. అళగు కార్తీక్‌ వెల్లడించారు. అద‌వ్ క‌ణ్ణ‌దాస‌న్‌,ర‌న్య‌రావ్‌, మాన‌స్‌, జ‌య‌శ్రీ‌, జాన్‌వీ ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల‌ కానుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

OTT Top 10 Movies: ఇండియా వైడ్‌గా ఓటీటీలో దుమ్ములేపుతున్న ఫ్యామిలీ థ్రిల్లర్‌.. ప్రైమ్‌లో టాప్‌ 10 మూవీస్‌
Pan India Movies: ఇప్పుడు కనుక రిలీజై ఉంటే ఈ సినిమాలకు 1000 కోట్లు పక్కా.. జనాలు మరిచిపోయిన ఆ నటి మూవీ కూడా