లక్కీ ఛాన్స్ కొట్టేసి శ్రీముఖి.. మొన్న మెగాస్టార్.. ఇప్పుడు బాలయ్య..రాములమ్మ అదృష్టం మూమూలుగా లేదు

Published : Mar 02, 2023, 05:10 PM IST
లక్కీ ఛాన్స్ కొట్టేసి శ్రీముఖి.. మొన్న మెగాస్టార్.. ఇప్పుడు బాలయ్య..రాములమ్మ అదృష్టం మూమూలుగా లేదు

సారాంశం

స్టార్ యాంకర్ శ్రీముఖి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. వెండితెరపై వెలుగాలన్న తనకోరికను నెరవేర్చుకుంటుంది బ్యూటీ. కాస్త లేట్ అయినా.. మంచి మంచి అవకాశాలు సాధిస్తోంది.   

బుల్లి తెరన కొన్ని ఏళ్లుగా ఏలుతోంది యాంకర్ శ్రీముఖి. నటిగా కెరీర్ ను మొదలు పెట్టి.. యాంకర్ గా స్థిరపడిన ఈబ్యూటీ.. యాక్ట్రస్ గానే కెరీర్ ను బిల్డ్ చేసుకోవాలి అని మొదటి నుంచీ ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఆమెకు సరైన అవకాశాలు రాలేదు.   అయినా సరే అవకాశాలు వెతుక్కూని మరీ సినిమాలు చేసింది. గతంలో జులాయ్, నేను శైలజ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ నటిగా మెరుపులు మెరిపించిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా మాస్ట్రో మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది.   

బుల్లితెరకి గ్లామర్ టచ్ ఇచ్చిన యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. ఆ మధ్య ఆమె కొన్ని సినిమాల్లో మెరిసింది కూడా. కానీ ఆ తరువాత టీవీ షోస్ పైనే దృష్టిపెడుతూ వచ్చింది. హీరోయిన్ ను మించి మెయింటేన్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సాధించిన శ్రీముఖి... నటనపై ఉన్న ప్రేమతో ప్రేయత్నాలు చేస్తూనే ఉంది. ఈక్రమంలోనే బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళి.. ఇంకా క్రేజ్ నుపెంచుకుంది. ఈక్రమంలోనే ఆమెకు అదృష్ణం వరించింది. రీసెంట్ గా  చిరంజీవి భోళా శంకర్  సినిమాలో.. ముఖ్యమై పాత్రను పొషస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ లో పాల్గోనబోతుంది బ్యూటీ.. 

ఇక ఈక్రమంలోనే మరో అద్భుతమైన అవకాశాన్ని సాధించింది శ్రీముఖి. నటసింహం నందమూరి బాలకృష్ణ 108 మూవీలో శ్రీముఖిని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో ఆమె  ఓ ముఖ్యమైన పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ లో ఆమె జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుండగా, ఆమెకి ఫ్రెండ్ పాత్రలో శ్రీముఖి కనిపించనున్నట్టు సమాచారం. అంతే కాదు ఈసినిమాలో శ్రీముఖి ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేయబోతుననట్టు తెలుస్తోంది. 

ఇక వరుస సినిమాలతో మంచి ఊపు మీద ఉన్నాడు బాలయ్య.. రీసెంట్ గా తన 107వ సినిమాగా వచ్చిన వీరసింహారెడ్డి సూపర్ సక్సెస్ సాధించడంతో.. యమా జోరుగా.. 108 మూవీని పట్టాలెక్కించాడు బాలయ్య. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను డిఫరెంట్ క్యారెక్టర్ లె కనిపించనున్నాడు. తెలంగాణ యాసలో బాలయ్య బాబు డైలాగ్స్ చెప్పబోతునట్టు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో బాలయ్య 108వ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్