శివాజీరాజా ఓడిపోతే శ్యామల కంగ్రాట్స్ చెప్పింది!

Published : Mar 24, 2019, 09:50 AM IST
శివాజీరాజా ఓడిపోతే శ్యామల కంగ్రాట్స్ చెప్పింది!

సారాంశం

కొద్దిరోజుల వరకు 'మా' ఎన్నికల హడావిడి బాగానే నడిచింది. శివాజీరాజా, నరేష్ ఒకరినొకరు దూషించుకావడంతో ఎన్నికలు మరింత వేడెక్కాయి. 

కొద్దిరోజుల వరకు 'మా' ఎన్నికల హడావిడి బాగానే నడిచింది. శివాజీరాజా, నరేష్ ఒకరినొకరు దూషించుకావడంతో ఎన్నికలు మరింత వేడెక్కాయి. ఇండస్ట్రీలో అందరి చూపు 'మా' ఎన్నికలపై పడింది. ఫైనల్ గా ప్రెసిడెంట్ గా నరేష్ గెలిచారు.

అయితే ఈ విషయం యాంకర్ శ్యామలకి తెలియనట్లుంది. అందుకే ఓడిపోయిన శివాజీరాజాకి కంగ్రాట్స్ చెప్పింది. నిన్న జరిగిన 'సూర్యకాంతం' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి శివాజీరాజా హాజరయ్యారు. ఫంక్షన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్యామల.. శివాజీరాజాతో మాట్లాడుతూ.. ''ముందుగా 'మా' ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మీకు కంగ్రాట్స్'' అంటూ చెప్పింది.

అంతేకాదు.. గెలిచిన తరువాతఫస్ట్ ఈవెంట్ ఇదే అనుకుంటా అనేసరికి శివాజీరాజా ముఖకవళికలు మారిపోయాయి. గెలిచింది నేను కాదంటూ సర్దిచెప్పుకోవడానికి  ప్రయత్నించాడు.

నా టీంలో కొంతమంది గెలిచారని.. నేను ఓడిపోయానని ఇబ్బందిగా చెబుతుండగా.. ఇంతలో శ్యామల మీ టీం గెలవడం అంటే మీరు ముందుండి గెలిపించడమే కదండీ అంటూ చెప్పడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో శ్యామలపై సెటైర్లు పడుతున్నాయి.   

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?