`విక్రమార్కుడు 2` అప్‌డేట్‌.. రవితేజ, రాజమౌళిల రియాక్షన్‌ ఇదే?

Published : Mar 09, 2024, 05:12 PM IST
`విక్రమార్కుడు 2` అప్‌డేట్‌.. రవితేజ, రాజమౌళిల రియాక్షన్‌ ఇదే?

సారాంశం

రాజమౌళి, రవితేజ కాంబినేషన్‌లో `విక్రమార్కుడు` సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌ రెడీ అవుతుంది.   


దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో `విక్రమార్కుడు` ఒకటి. మాస్‌ మహారాజాకి బిగ్‌ బ్రేక్‌ ఇచ్చిన మూవీలో ఒకటి. రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇందులో రవితేజకి జోడీగా అనుష్క నటించింది. 2006లో ఈ సినిమా విడుదలై అదరగొట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన సీక్వెల్‌ డిస్కషన్‌ మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల `విక్కమార్కుడు 2` చేసేందుకు ప్లాన్‌ జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

నిర్మాత కెకె రాధామోహన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. మరి హీరో, దర్శకుడికి సంబంధించిన అప్‌ డేట్‌ విషయాలు బయటకు వచ్చాయి. రవితేజ హీరోగానే ప్లాన్‌ చేస్తున్నారట. అయితే దర్శకుడిగా కొత్త పేరుతెరపైకి వచ్చింది. రాజమౌళి ప్రస్తుతం మహేష్‌ బాబుతో `ఎస్‌ఎస్‌ఎంబీ29` సినిమా చేయబోతున్నారు. దీంతో మరో సినిమాకి ఆయన టైమ్‌ ఇచ్చే పరిస్థితి లేదు. పైగా ఇప్పుడు చిన్న సినిమాలు చేసే ఉద్దేశ్యం, టైమ్ ఆయనకు లేదు. 

మరి దర్శకుడు ఎవరంటే సంపత్‌ నంది పేరు తెరపైకి వచ్చింది. కెకె రాధామోహన్‌ `విక్రమార్కుడు 2`ని మూడేళ్ల క్రితమే రిజిస్టర్‌ చేయించారట. విజయేంద్రప్రసాద్‌ దీనికి సంబంధించిన కథని కూడా సిద్ధం చేస్తున్నాడట. దీనిపై వర్క్ జరుగుతుందట. అయితే హీరో ఎవరనేది ఇప్పుడు పెద్ద చర్చ. రవితేజని ఈ మూవీకోసం అప్రోచ్‌ కాగా ఆయన నో చెప్పినట్టు సమాచారం. రాజమౌళి అయితే సినిమా చేసేందుకు ఆయన సిద్ధమే, కానీ జక్కన్నకి పాజిబులిటీ లేదు. దీంతో రవితేజ నో చెబుతున్నట్టు సమాచారం. ఆయన్ని కన్విన్స్ చేసే పనిలో టీమ్‌ ఉంది. మరి ఆయన ఏం చెబుతాడో చూడాలి. ఆయన కాదంటే ఎవరితో చేస్తారు? అసలు మూవీ ఉంటుందా అనేది సస్పెన్స్ గా మారింది. దీనికి సంబంధించిన క్లారిటీ మున్ముందు రానుంది. 

ఇక రవితేజ ప్రస్తుతం `మిస్టర్‌ బచ్చన్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు ఆయన చేతిలో మరో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. `ఈగల్‌ 2` కూడా ఉంది. నెక్ట్స్ ఏ మూవీ స్టార్ట్ చేస్తారనేది చూడాలి. మరోవైపు సంపత్‌ నంది చేయాల్సిన `గంజా శంకర్‌` ఆగిపోయింది. దీంతో `విక్రమార్కుడు2`పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుంది, చివరికి ఏది ఫైనల్‌ అవుతుందో చూడాలి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?