బిగ్ బాస్ ఎంట్రీపై యాంకర్ లాస్య కామెంట్స్!

By AN TeluguFirst Published Jun 26, 2019, 10:12 AM IST
Highlights

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకొంది. 

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకొంది. త్వరలోనే మూడో సీజన్ మొదలుకాబోతుంది. ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టంట్లు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ ప్రత్యక్షమైంది.

ఆ లిస్ట్ లో ఉన్న సెలబ్రిటీలు చాలా మంది బిగ్ బాస్ లో పాల్గొనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా యాంకర్ లాస్య కూడా బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నట్లు సోషల్ మీడియాలో  వార్తలు వినిపించాయి. దీనిపై స్పందించిన లాస్య.. తను బిగ్ బాస్ షోలో పాల్గోనబోతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

ఈ మేరకు ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో.. ''మీకో.. విషయం తెలుసా.. నేను బిగ్ బాస్ కి వచ్చేస్తున్నాను.. బిగ్ బాస్ లో లాస్య కన్ఫర్మ్ అయిపోయింది.. లాస్యకి బిగ్ బాస్ షో వాళ్లు ముప్పై లక్షల రెమ్యునరేషన్ ఇచ్చేస్తున్నారు.. అబ్బా ఇది వినడానికి ఎంత బాగుందో.. కానీ ఇదంతా అబద్దం'' అంటూ చెప్పుకొచ్చింది.

చాలా మంది తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాననుకొని ఫోన్లు చేసి కంగ్రాట్స్ చెబుతున్నారని.. అది ఫేక్ న్యూస్ అని వెల్లడించింది. తనకు చిన్నబాబు ఉన్నాడని.. బాబుతోనే టైం సరిపోతుందని.. ఇలాంటి సమయం మళ్లీ రాదని చెప్పింది. ఈ ఏడాది పూర్తిగా బాబుతోనే గడపాలని అనుకుంటున్నట్లు చెప్పిన ఆమె ఏదైనా ఉంటే నెక్స్ట్ టైం చూద్దామని తెలిపింది. 

click me!