రీమేక్ టాక్: పవన్ పాత్రలో అభిషేక్ బచ్చన్

By Surya Prakash  |  First Published Feb 8, 2021, 12:02 PM IST


ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను ఇతర భాషల్లో డబ్​ చేసి విడుదల చేయడం లేదా రీమేక్​ చేయడం చిత్రసీమలో రెగ్యులర్ గా జరిగే వ్యవహారమే. బాలీవుడ్​ నుంచి దక్షిణాది సినీపరిశ్రమకు ఎగుమతైన చిత్రాలున్నాయి. అలాగే దక్షిణాది సినిమాలూ చాలా వరకూ హిందీలో రీమేక్​ అయ్యాయి. తమిళంలో సూపర్​హిట్​గా నిలిచిన 'గజిని' (2008) నుంచి నిన్నమొన్నటి 'అర్జున్​రెడ్డి' (2019) వరకు బాలీవుడ్​లో అనేక రీమేక్​ సినిమాలు సూపర్​హిట్​ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమా బాలీవుడ్ ని పలకరించటానికి రెడీ అవుతోంది. ఆ సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆ సినిమానే  `అయ్యప్పనుమ్ కోషియయమ్`.    
 


 మలయాళంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం `అయ్యప్పనుమ్ కోషియయమ్`. బిజూ మీనన్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రధారులుగా సాచి రూపొందించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. పవన్ కల్యాణ్, రానా హీరోలుగా ఈ సినిమా ప్రస్తుతం తెలుగులోకి రీమేక్ అవుతోంది. సాగర్ కె చంద్ర ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. 

త్వరలో ఈ సినిమా హిందీలోకి కూడా వెళ్లబోతోంది. ఈ సినిమా హిందీ రీమేక్‌ హక్కుల్ని జాన్‌ అబ్రహం సొంతం చేసుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతోందట. జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తారట.  

Latest Videos

ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ జేఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా జాన్ అబ్రహం ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. అయితే తాజాగా హిందీ రీమేక్ లో జాన్ అబ్రహం అభిషేక్ బచ్చన్ కలిసి నటించనున్నట్లు సమాచారం. ఈ విషయం కూడా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు జాన్. అంతేగాక అయ్యప్పనుమ్ కోషియం గురించి మాట్లాడుతూ.. యాక్షన్ థ్రిల్ చక్కటి కథాంశాలతో పొందికగా రూపొందింది. అలాంటి ఫీల్ గుడ్ స్టోరీని తెరకెక్కించాలనే ఉద్దేశంతో హిందీ హక్కులను సొంతం చేసుకున్నాం' అని చెప్పుకొచ్చాడు. 

 పృథ్వీ రాజ్, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో రైటర్ టర్న్డ్ డైరెక్టర్ సాచి రూపొందించిన ఈ చిత్రం ఇద్దరు వ్యక్తుల మొదలైన చిన్న గొడవ ఇగో క్లాష్ కారణంగా ఏ స్థాయికి వెళ్లిందనే కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,   రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలోనూ ఈ సినిమా రీమేక్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీ రీమేక్ కూడా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేసే నటులు కూడా ఖరారైనట్లు సమాచారం. 

తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్న పాత్రను హిందీలో అభిషేక్ బచ్చన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అది మళయాళంలో పృధ్వీరాజ్ చజేసారు.  ఇంకా ఈ చిత్రానికి దర్శకుడు ఖరారవ్వలేదు. తన టీంతో స్క్రిప్టును హిందీకి అనుగుణంగా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు జాన్ అబ్రహాం. అభిషేక్‌కు ఈ సినిమాలో నటించడానికి పెద్దగా అభ్యంతరాలు లేకపోవచ్చు.

జాన్, అభిషేక్ కలిసి ఇంతకుముందు రెండు సినిమాల్లో నటించారు. అందులో ఒకటి.. ధూమ్. అదెంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ తర్వాత వీళ్లిద్దరూ ‘దోస్తానా’లో నటించారు. అది కూడా బాగానే ఆడింది. ఇప్పుడు మూడోసారి వీళ్లిద్దరూ జోడీ కట్టబోతున్నారు. త్వరలోనే ‘అయ్ప్పనుం కోషీయుం’ హిందీ రీమేక్ సెట్స్ మీదికి వెళ్లనుందట. తమిళంలోనూ ఈ ఏడాదే దీని రీమేక్ మొదలయ్యే అవకాశాలున్నాయి.

click me!