ఇద్దరు హీరోలతో యాంకర్ అనసూయ స్టెప్పులు!

Published : Dec 05, 2018, 10:50 AM IST
ఇద్దరు హీరోలతో యాంకర్ అనసూయ స్టెప్పులు!

సారాంశం

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారిపోయింది. ఓ పక్క టీవీ షోలు, ఓ పక్క సినిమాలు అంటూ తీరిక లేకుండా గడిపేస్తుంది. 

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారిపోయింది. ఓ పక్క టీవీ షోలు, ఓ పక్క సినిమాలు అంటూ తీరిక లేకుండా గడిపేస్తుంది. ప్రస్తుతం 'కథనం' సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోన్న ఈ బ్యూటీ మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది.

తాజాగా ఓ మల్టీస్టారర్ సినిమాలో ఐటెం సాంగ్ కి ఒప్పుకున్నట్లు సమాచారం. గతంలో సాయి ధరం తేజ్ హీరోగా నటించిన 'విన్నర్' సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన అనసూయ ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది.

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా దర్శకుడు అనీల్ రావిపూడి 'ఎఫ్2' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ఈ సినిమాలో ఓ పాటలో అనసూయ ఇద్దరు హీరోలతో కలిసి స్టెప్పులేయనుంది.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నేటి నుండి సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్