
యాంకర్ అనసూయ, ఆమె కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ఇటీవల అనంతపూర్ లో యాక్సిడెంటుకు గురైంది. అయితే అదృష్ట వశాత్తు అనసూయతో పాటు ఆమె కుటుంబ సభ్యులు చిన్నపాటి గాయాలతో బయట పడ్డారు. తనకు ఏమయిందో అని కంగారు పడుతున్న అభిమానులకు అనసూయ సోషల్ మీడియా ద్వారా సందేశం ఇచ్చింది. తనకు బాగానే ఉందని, అదృష్ట వశాత్తు తనతో పాటు తన కుటుంబ సభ్యులు బ్రతికి బయట పడ్డారని... ఇది తనకు పునర్జన్మ లాంటిదని ఆమె తెలిపారు.
యాక్సిడెంట్ సమయంలో తనతో పాటు తన భర్త, ఇద్దరు పిల్లలు, తన సిస్టర్ ఉన్నట్లు అనసూయ వెల్లడించారు. తాము ప్రయాణిస్తున్నది ఆడి స్పోర్ట్స్ యుటిలిటీ పెద్ద వెహికిల్ కావడం, ఎయిర్ బ్యాగ్స్ సమయానికి తెరుచుకోవడంలో అంతా క్షేమంగా బయటపడ్డామని అనసూయ తెలిపారు. తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆడి కారును అనంతపూర్ వద్ద యాక్సిడెంట్ జరగడం వల్ల దగ్గర్లోని బెంగుళూరు షోరూమ్ లో చేర్పించామని అనసూయ బాధ పడుతూ చెప్పింది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో నేను తప్ప అందరూ సీటు బెల్టు పెట్టుకున్నారు. రోడ్డంతా ఖాళీగా ఉంది, కాస్త పట్టేసినట్లు ఉందని యాక్సిడెంట్ జరిగే కొద్ది సమయానికి ముందే సీటు బెల్టు తీసేసాను. అందుకే నా తలకు చిన్న గాయమైంది. ఎవరైనా సరే యాక్సిడెంట్ సమయంలో సీటు బెల్టు తప్పకుండా పెట్టుకోండి అని అనసూయ సూచించారు.
మరో కారులో వస్తున్న వ్యక్తి అధిక వేగంగతో తమను కారుకు అడ్డు రావడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగిందని, దాని నుండి తప్పించుకునే క్రమంలో తమ కారు డివైడర్ ను ఢీ కొట్టిందని, ఆ కారును డ్రైవ్ చేసే వ్యక్తి బాగా తాగి ఉండటం వల్లనే యాక్సిడెంట్ జరిగిందన్న అనసూయ అతడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ యాక్సిడెంటుకు కారణమైన, తాగి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి వెల్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీకి చెందిన వాడు. ఈ ప్రమాదంతో వాళ్ల నాన్న చాలా బాధ పడ్డాడు. కేసు పెడదామని అనుకున్నాం. మేము పెద్ద కారులో ఉన్నాం, ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నాయి కాబట్టి బ్రతికాం. వేరే కారు అయితే మా పరిస్థితి ఎలా ఉండేదో. మా పిల్లలతో ఉన్నా.. ఈ యాక్సిడెంట్ అవగానే చాలా కోపం వచ్చింది. తాగున్న అతడిని పోలీస్ స్టేషన్ కు ఈడుద్దామనుకున్నాను. కానీ వాళ్ల నాన్న పరిస్థితి చూసి ఆగిపోయాం. ఆ స్థానంలో మేము ఉంటే ఎలా ఉండేదో అని ఆలోచించి లైట్ తీసుకున్నామని అనసూయ తెలిపారు.
ఇప్పటికైనా అందరూ మారండి, తాగి డ్రైవ్ చేయడం మానేయండి. సీటు బెల్టు తప్పకుండా పెట్టుకోండి. మాకు యాక్సిడెంట్ కావడానికి కారణమైన వ్యక్తి లేదా వారి బంధువులు మా స్థానంలో మీరు ఉంటే ఎలా ఉండేదో ఆలోచించండి అంటోంది అనసూయ.