అనసూయను చూసేందుకు పోటెత్తిన కుర్రాళ్లు... ఇంత క్రేజ్ ఏంటి సామీ!

అనసూయ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం పలాస వెళ్లారు. అనసూయ రాకను తెలుసుకున్న కుర్రాళ్ళు పెద్ద ఎత్తున పోటెత్తారు.

Google News Follow Us


నటి అనసూయకు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యక్షంగా చూసిన జనాలు స్టన్ అవుతున్నారు. ఆమెను చూసేందుకు కుర్రాళ్ళు ఎగబడ్డారు. అనసూయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల పలాసకు వచ్చారు. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ నిమిత్తం ఆమె పలాస రావడమైంది. అనసూయ రాకను తెలుసుకున్న యువత అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తన అభిమానులను అనసూయ తన స్పీచ్ తో అలరించారు. పలాస నగరం జనాలతో నిండిపోయింది. ఇక తన పలాస పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అనసూయ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. 

జబర్దస్త్ యాంకర్ గా అనసూయ పాపులారిటీ తెచ్చుకున్నారు. అనంతరం నటిగా ఎదిగారు. హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న అనసూయ యాంకరింగ్ పూర్తిగా మానేసిన విషయం తెలిసిందే. ఆ విధంగా ఆమెకు బుల్లితెర వివాదాలకు దూరమయ్యారు. అసలు యాంకర్ గా తాను చేసే పనులు కొన్ని ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుందని పరోక్షంగా చెప్పారు.  ఇటీవల బుల్లితెర షోల మీద భయంకరమైన ఆరోపణలు చేసింది. షో నిర్వాహకులు టీఆర్పీ కోసం పనికిమాలిన పనులకు పాల్పడుతున్నారని అవి తనకు నచ్చక యాంకరింగ్ మానేసినట్లు పరోక్షంగా  చెప్పారు. అనసూయ ప్రధానంగా తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని టార్గెట్ చేయడం విశేషం. 

అలాగే నటిగా బిజీగా ఉన్న అనసూయకు యాంకరింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె చేతిలో లెక్కకు మించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అధికారికంగా పుష్ప 2, రంగమార్తాండ చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని సమాచారం. అనసూయ ఒక్క కాల్షీట్ కి రూ. 3 లక్షలు తీసుకుంటున్నారట. పుష్ప 2లో అనసూయ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ రోల్ పై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. 

ఇటీవల అనసూయపై సోషల్ మీడియా ట్రోలింగ్ ఎక్కువైంది. దీనిపై అనసూయ యుద్ధమే చేస్తున్నారు. మితిమీరి ప్రవర్తించిన వారిమీద చర్యలకు పాల్పడుతున్నారు. ఆ మధ్య ఒక వ్యక్తి మీద ఫిర్యాదు చేసి జైలుపాలు చేసింది. నెటిజన్స్ కామెంట్స్ ని సాధారణంగా సెలెబ్రిటీలు పట్టించుకోరు. అనసూయ మాత్రం రియాక్ట్ అవుతుంది. సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. 
 

Read more Articles on