ఫ్రీడమ్‌ ఫైటర్‌గా మారిపోయిన అనసూయ.. ఇండిపెండెన్స్ డే ట్రిబ్యూట్‌..

Published : Aug 14, 2023, 03:51 PM ISTUpdated : Aug 14, 2023, 04:31 PM IST
ఫ్రీడమ్‌ ఫైటర్‌గా మారిపోయిన అనసూయ.. ఇండిపెండెన్స్ డే ట్రిబ్యూట్‌..

సారాంశం

1857తిరుగుబాటు ఉద్యమంలో కీలక భూమిక పోషించిన క్వీన్‌ ఆఫ్‌అవాద్‌ బేగమ్‌ హజ్రత్‌ మహల్‌ని గుర్తు చేసుకుంది అనసూయ. ఆమెకి ట్రిబ్యూట్‌తో ఓ క్రేజీ పని చేసింది.

స్వాతంత్య్రోద్యమంలో 1857 తిరుగుబాటుకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. మొదటి స్వాతంత్య్రోద్యమ తిరుగుబాటుగా దీన్ని వర్ణిస్తుంటారు. అదే సమయంలో 1857 తిరుగుబాటు అంటే ఝాన్సీ రాణి లక్ష్మీ బాయ్‌ పేరే గుర్తొస్తుంది. కానీ ఆమెతోపాటు ఎంతో మంది ఫైటర్స్ ఈ తిరుగుబాటు ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు అర్పించారు. బ్రిటీష్‌కి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటులో కీలక భూమిక పోషించారు. వారిలో ఒకరు బేగమ్‌ హజ్రత్‌ మహల్‌.

నార్త్ ఇండియాలోని అవాద్‌ రాజ్యానికి చెందిన నవాబ్‌ వాజిద్‌ అలీ షా రెండో భార్య బేగం హజ్రత్. ఆమె చేసిన పోరాటానికి అంతా ఆమెని బేగమ్‌ ఆఫ్‌ అవాద్‌గా(క్వీన్‌ ఆఫ్‌ అవాద్‌) పిలుస్తుంటారు. 1857-58లో ఆ రాజ్యం నుంచి ఆమె రాజ్యప్రతినిధిగా వ్యవహరించారు. 1857 తిరుగుబాటు ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు. అయితే ఆమెని ఇప్పటి జనరేషన్‌ మర్చిపోయింది. అలాంటి గుర్తింపు దక్కని వీరనారికి తాను గుర్తింపు ఇస్తానంటోంది అనసూయ. ఆమెని గుర్తు చేసుకుంటూ తాజాగా బేగం హజ్రత్‌గా మారిపోయింది. ఈ సందర్భంగా ఓ నోట్‌ని షేర్‌ చేసింది అనసూయ భరద్వాజ్‌. 

బేగం హజ్రత్‌ మహల్‌.. గెటప్‌ ధరించి ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆమెకి ట్రిబ్యూట్‌ చేస్తున్నట్టు వెల్లడించింది.  రివల్యూషనరీ క్వీన్‌ ఆఫ్‌ అవాద్‌ గా పిలవబడే బేగమ్‌ రూపాన్ని తాను పునసృష్టించడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది అనసూయ. ట్విట్టర్‌ ద్వారా ఓ నోట్ పేర్కొంది. ఇందులో చెబుతూ, హజ్రత్‌ మహల్‌ని కలవండి, ఇది భారతదేశ గత చరిత్రకి గుర్తుగా, నిర్భయమైన ట్రయల్‌ బ్లేజర్‌ అని పేర్కొంది అనసూయ. మొదటి స్వాతంత్ర సంగ్రామంలో ఆమె భారతదేశంపు తొలి మహిళా స్వాతంత్ర సమరయోధులలో ఒకరిగా ఉద్భవించినట్టు చెప్పింది. 

బేగం హజ్రత్‌ మహల్‌ భారత స్వాతంత్ర్య పోరాటాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్‌ పాలనను సవాల్‌ చేయడానికి రెండు దశాబ్దాల పాటు తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె వారసత్వాన్ని గుర్తు చేస్తూ భారత ప్రభుత్వం 1984 మే 10న ఆమెపై ఓ స్టాంపుని కూడా విడుదల చేశారు. ఇది ఆమె శాశ్వత ప్రభావానికి నిదర్శనం. ఈ ఇండిపెండెంట్‌ డే సందర్భంగా వారి ధైర్యం, నిబద్ధతతో మనకు స్ఫూర్తినిచ్చే బేగం హజ్రత్‌ మహల్‌ వంటి మరచిపోయిన వీరులను స్మరించుకుందాం, వారిని సెలబ్రేట్‌ చేసుకుందామని చెప్పింది అనసూయ. ఈ సందర్భంగా బేగం హజ్రత్‌ గెటప్‌లో దిగిన ఫోటోని పంచుకుంది. భారతప్రభుత్వం విడుదల చేసిన స్టాంపు లుక్‌ మాదిరిగా అనసూయ రెడీ కావడం విశేషం. ఇదిఆకట్టుకుంటూ వైరల్ అవుతుంది. 

ఇక అనసూయ.. యాంకర్‌గా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు యాంకరింగ్‌ మానేసి సినిమాలు చేస్తుంది. ఇటీవల `విమానం`, `రంగమార్తాండ` చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం `పుష్ప2`, `సింబా`, `వుల్ఫ` వంటి చిత్రాలు చేస్తుంది. నటిగా ఆమె బిజీగా ఉంది. ఖాళీ టైమ్‌లో ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తుందీ హాట్‌ యాంకర్‌.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే