
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కతున్న చిత్రం ‘ రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇంకా విడుదల కాలేదు. ఇందులో రామ్ చరణ్ ఒక పల్లెటూరి యువకుడిగా కనపడుతున్నాడన్న విషయం తప్ప అతని క్యారక్టరైజేషన్ గురించి క్లారిటీ లేదు.
అయితే.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న హాట్ యాంకర్ అనసూయ కామెంట్స్.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కే. విశ్వనాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ.. స్వయం కృషి తో రంగస్థలం సినిమాని పోల్చింది అనసూయ. స్వయంకృషి లాగానే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని చెప్పింది. అంతేకాకుండా చరణ్ తనకు ఇప్పటి వరకు ఒక వ్యక్తిగా మాత్రమే తెలుసని.. ఈ సినిమా ద్వారా నటుడిగా అతనేంటో తెలిసిందన్నారు.ఈ సినిమా కోసం చరణ్.. హార్ట్ అండ్ సోల్ పెట్టి పనిచేస్తున్నాడని కితాబు ఇవ్వడంతో.. మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో అనసూయ రామ్ చరణ్ కి మేనత్త పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. అంతేకాదు ఈసినిమాలో అనసూయ పాత్ర సరికొత్తగా ఉండబోతోంది అనే విషయాలు కూడ బయటకు వస్తున్నాయి.