
అనసూయ బుల్లితెరపై ఎంతటి స్టార్ యాంకరో వెండితెరపై కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది.
ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం రవితేజ ఖిలాడీ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో అనసూయ పాత్రలో మంచి అంచనాలు ఉన్నాయి. పుష్ప చిత్రం తర్వాత అనసూయ క్రేజ్ మరింతగా పెరిగింది. దీనితో ఆమె ఖిలాడీ చిత్రంలో ఎలాంటి రోల్ లో నటిస్తోంది అనే ఉత్కంఠ నెలకొంది.
ఉత్కంఠని కొంత తగ్గిస్తూ చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే అనసూయ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో అనసూయ చీరకట్టులో అందంగా సిగ్గు పడుతూ కనిపిస్తోంది. అనసూయ లుక్ చూడ ముచ్చటగా ఉందనే చెప్పాలి.
ఆసక్తికర అంశం ఏంటంటే అనసూయ ఈ మూవీలో డ్యూయెల్ రోల్ లో నటిస్తోంది అట. అనసూయ కోసం రమేష్ వర్మ బలమైన పాత్రనే రచించినట్లు తెలుస్తోంది. రెండు పాత్రల్లో ఒక పాత్రలో అనసూయ బ్రాహ్మణ యువతిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఒక పాత్రలో అనసూయ మరణిస్తుంది అని టాక్.
అన్ని అనుకూలంగా జరిగితే ఫిబ్రవరి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం సాంగ్స్ విడుదల చూస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు.