
ఈమధ్య విమర్శకులను స్పోర్టివ్ గా తీసుకోవడం మానేసి మన సెలెబ్రెటీలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయడం అలవాటుగా పెట్టుకుంటున్నారు. అభిమానులపై కొందరు టీవీ, ఫిల్మ్ స్టార్స్ పబ్లిగ్గానే తమ అసహనాన్ని ప్రదర్శిస్తూ... ఒక్కోసారి చేయి చేసుకుంటున్న ఘటనలు చూశాం. ఈ సారి ఓ మహిళా యాంకర్ ఓ నెటిజన్ పై రియాక్ట్ అయిన తీరు చూస్తే... అసహనం ఏ రేంజిలో పెరిగిపోయిందో తెలుస్తుంది.
బుల్లి తెర యాంకర్స్ లో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ అనసూయ తన బుల్లితెర షోలలో ఎక్కువగా స్కిన్ షో చేస్తోందని, చిట్టిపొట్టి బట్టలతో ఎక్స్ పోజింగ్ చేస్తూ ఆమె బుల్లితెర పై కనిపించడం మితిమీరిపోతోంది అంటూ అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఆ కామెంట్స్ ను అనసూయ పట్టించు కోకుండా రెచ్చి పోతూనే ఉంది.
తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ లో ఒక నెటిజన్ చేసిన కామెంట్ అనసూయకు చిర్రాకు తెప్పించింది. ‘‘నీకేమైనా ఇంగిత జ్ఞానం ఉందా అనసూయా, ఎందుకలా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావు, మేం ఫ్యామిలీతో కలిసి ప్రోగ్రామ్స్ చూడక్కర్లేదా’’ అంటూ ఆ నెటిజన్ తన బాధను వ్యక్త పరిచాడు. అయితే దీనిపై అనసూయ తీవ్రంగా స్పందించింది. కుటుంబ విలువల గురించి అంతగా పట్టింపు ఉంటే ఇతరుల విషయాల్లో దూరకు. " నీ పని నువ్వు చూస్కో రా " అంటూ కాస్త ఘాటు గానే సమాధానం చెప్పింది అనసూయ. కుటుంబ విలువల పట్ల అంత ప్రేమ ఉంటే వేరే కార్యక్రమాలకు మారేందుకు రిమోట్ బటన్ చాలు కదా అంటూ సలహా ఇచ్చింది.
తనది కాకుండా వేరే కార్యక్రమం చూస్తూ ఉంటే అడ్డుపడ్డానా అంటూ రివర్స్ క్లాస్ పీకింది అనసూయ. అంతేకాదు.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో సలహాలు తీసుకోవలసిన పరిస్థితిలో తాను లేనంటూ రిప్లైలో దాడి చేసింది అనసూయ.