3 నిమిషాల సాంగ్‌కి ఎంత ఛార్జ్ చేస్తోందో తెలిస్తే మైండ్ బ్లాక్

Surya Prakash   | Asianet News
Published : Jan 31, 2021, 03:05 PM IST
3 నిమిషాల సాంగ్‌కి ఎంత ఛార్జ్ చేస్తోందో తెలిస్తే మైండ్ బ్లాక్

సారాంశం

జబర్దస్త్ పోగ్రాంతో పాపులర్ అయిన అనసూయ సినిమాల్లోనూ వరస ఆఫర్స్ సంపాదించుకుంటోంది. ఓ ప్రక్కన సినిమాల్లో కీరోల్స్ చేస్తూనే మరో ప్రక్క స్పెషల్ సాంగ్స్ చేస్తోంది. ఆ మధ్యన సోగ్గాడే చిన్నినాయనలో స్పెషల్ సాంగ్ లో కనపడి దుమ్ము రేపిన అనసూయ.. రంగస్థలం  లో గంగమ్మత్తగా రచ్చ రచ్చ చేసింది. అంతేకాదు.. ఈ మధ్య కాలంలో వరసపెట్టి ఫొటో షూట్స్ పెట్టుకుంటూ కుర్రాళ్ల గుండెలను మెలితిప్పేస్తోంది. తనదైన హాట్ ఫిగర్, అభినయంతో అభిమానుల్ని ఆకట్టుకుంటోన్న ఆమెకు స్పెషల్ సాంగ్ ఆపర్స్ వరస వస్తున్నాయి. అయితే అందుకు తగ్గ రెమ్యునేషన్ ముడితేనే ఓకే చెప్తోంది.

 చాలా గ్యాప్ తర్వాత ఆమె ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుంది.  వైవిధ్యమైన పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న ... ఇలాంటి టైంలో ఆమె ఐటెం సాంగ్ చేసేందుకు అంగీకరించడం గొప్ప విషయం. కార్తికేయ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా రూపొందుతోన్న ‘చావు కబురు చల్లగా’ సినిమాలో ఆమె ఒక పాటలో మెరవనుంది. త్వరలోనే  ఆమెపై ఈ పాట షూట్ చేస్తున్నారు. అనసూయకి ఈ పాటలో కనిపిస్తున్నందుకు భారీ మొత్తం ముడుతోందని మీడియాలో వినపడుతోంది. 

3 నిమిషాల నిడివి ఉండే ఈ సాంగ్‌ కోసం అనసూయ రూ .20 లక్షలు డిమాండ్‌ చేయగా, చిత్ర యూనిట్ వెంటనే ఓకే చెసినట్లు సమాచారం. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్‌ షూట్‌ను త్వరలోనే హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కౌశిక్ దర్శకత్వం వహిస్తుండగా, బన్నీ వాసు నిర్మిస్తున్నారు.  

మార్చి నెలలోనే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అనసూయ, నటుడు అశ్విన్‌ విరాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం థ్యాంక్‌ యూ బ్రదర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే ఓటీటీలో విడుద‌ల‌ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.  కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగ మార్తాండ’లో కీలక పాత్రలో నటిస్తున్న అనసూయ..రవితేజ హీరోగా వస్తోన్న ‘కిలాడి’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళంలోనూ విజయ్ సేతుపతితో  జోడీ కట్టే ఛాన్స్‌ కొట్టేసింది అనసూయ.
 

PREV
click me!

Recommended Stories

Police Complaint Movie Review: పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ.. వరలక్ష్మి నటించిన సినిమా ఎలా ఉందంటే?
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే