ప్రమాదంలో యంగ్ బ్యూటీ.. భయంతో పారిపోయిన హీరో!

Published : Jun 08, 2019, 07:29 PM IST
ప్రమాదంలో యంగ్ బ్యూటీ.. భయంతో పారిపోయిన హీరో!

సారాంశం

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో మెరిసిన అనన్య పాండే ప్రస్తుతం కుర్రకారు హృదయాల్ని కోలోలగొట్టే పనిలో ఉంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. లే

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో మెరిసిన అనన్య పాండే ప్రస్తుతం కుర్రకారు హృదయాల్ని కోలోలగొట్టే పనిలో ఉంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. లేత పరువాల అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడి చూపులకు యువత అభిమానులుగా మారిపోతున్నారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్ర షూటింగ్ సమయంలో అనన్య పాండే ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొందట. 

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో రిక్స్ తో కూడుకున్న సన్నివేశంలో నటించానని, చావు అంచుల వరకు వెళ్ళొచ్చానని అనన్య పాండే తెలిపింది. కారు వెళ్లి చెట్టుకు ఢీకొనే సన్నివేశం అది. ఆ సీన్ లో కారు డ్యామేజ్ అయింది. నాకు కూడా గాయాలయ్యాయి. సమయానికి ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాలతో బయట పడ్డా. 

హీరో టైగర్ ష్రాఫ్, సెట్స్ లో ఉన్నవాళ్ళంతా నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ కారు పేలిపోతుందేమోననే భయంతో తిరిగి వెనక్కు పారిపోయారు అని అనన్య తెలిపింది. ఆ తర్వాత ఎలాగోలా కారు నుంచి బయటపడ్డాను. ఇంత కష్టపడి ఆ సన్నివేశంలో నటిస్తే చివరకు ఎడిటింగ్ లో ఆ సీన్ ని తొలగించారు అని వాపోయింది. 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే