షారుఖ్ ఖాన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆనంద్ మహీంద్రా.. బాలీవుడ్ బాద్ షా స్వీట్ రిప్లై..

Published : Aug 03, 2023, 01:05 PM ISTUpdated : Aug 03, 2023, 01:08 PM IST
షారుఖ్ ఖాన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆనంద్ మహీంద్రా.. బాలీవుడ్ బాద్ షా స్వీట్ రిప్లై..

సారాంశం

యంగ్ స్టార్స్ కూడా కుళ్లుకునేలా.. హ్యాండ్సమ్ గా మెయింటేన్ చేస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా. తాజాగా షారుఖ్ ఖాన్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత దిగ్గజ వ్యాపారవేత్త  ఆనంద్ మహేంద్ర. ఇంతకీ షారుఖ్ ఖాన్ ఏం రిప్లై ఇచ్చాడంటే..? 


యంగ్ స్టార్ హీరోలు కూడా కుళ్లుకునేలా తయారయ్యాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. సిక్స్ ప్యాక్ తో టోన్డ్ బాడీతో షారుఖ్ ను చూసి.. అమ్మాయిలు ఇప్పుడు కూడా మనసు పారేసుకుంటున్నారు. 60 ఏళ్లకు వయస్సు  దగ్గరపడుతున్నా.. 30 ఏళ్లు అని చెప్పినా నమ్మే విధంగా హ్యాండ్సమ్ గా ఉన్నాడు షారుఖ్ ఖాన్. దాంతో అందరి దృష్టి ప్రస్తుతం ఆయనవైపే ఉంది. పైగా రీసెంట్ గా పటాన్ సినిమాతో భారీసక్సెస్ ను అందుకున్నాడు.. షారుఖ్  ఖాన్. త్వరలో జవాన్ సినిమాతో రాబోతున్నాడు.  

మరో వైపు వ్యాపార వేత్తగా ఓ పోజిషన్ లో ఉండి.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంటాడు ఆనంద్ మహేంద్ర.  సమకాలీన అంశాలపై సోషల్ మీడియాలో  ఎప్పుడూ యాక్టివ్‌గా స్పందిస్తుంటారు.  పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా టాలెంట్ ను బయటకు తీసి.. సోషల్ మీడియాలో శేర్ చేయడంతో పాటు.. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పలు విజ్ఞానదాయక అంశాలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. అప్పుడప్పుడూ ఆయన సరదా వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు.

ముఖ్యంగా సినిమా వాళ్లను ఎక్కువగా ఫాలోఅవుతుంటాడు ఆనంద్ మహేంద్రా.. అప్పట్లో ఆర్ఆర్ఆర్ ను బాగా ఫాలో అవ్వడంతో పాటు.. ఆస్కార్ సందర్భంగా వారిని అభినందించడం, చరణ్ తో కలిసి నాటు నాటు స్టెప్పులు కూడా వేశాడు ఆనంద్ మహేంద్ర. ఇక  తాజాగా ఆయన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చివరకు షారుఖ్ ఖాన్ స్వయంగా ఆనంద్ మహీంద్రాకు రిప్లై కూడా ఇచ్చారు. 

 

 

ఆ వివరాలలోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం షారుఖ్ నటించిన జవాన్ చిత్రంలోని జిందాబాద్ సాంగ్ విడుదలైంది. యూత్‌ఫుల్ లుక్స్‌లో అదరగొట్టిన షారుఖ్‌పై ఆనంద్ మహీంద్రా తాజాగా ట్వీట్ చేశారు. ఈ హీరో వయసు 57 ఏళ్లా? గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఆయన వయసు పెరుగుతున్నట్టు ఉంది. మిగతా వారికంటే ఆయన పది రెట్లు అధికంగా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు అని ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్‌పై షారుఖ్ వెంటనే స్పందించారు. జీవితం చాలా చిన్నదే కాదు వేగవంతమైంది కూడా సార్. ఈ స్పీడును అందుకునేందుకు ట్రై చేస్తున్నా. సంతోషం, దుఖం, డ్యాన్స్, చుక్కల్లో విహరించేలా భావన కల్పించడం..ఇలా ఎలా వీలైతే అలా వీలైనంతమందికి వినోదం పంచేందుకు ప్రయత్నిస్తున్నా.  సంతోషమైన క్షణాల కోసం కలకంటున్నా అని రిప్లై ఇచ్చారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అనేక మంది షారుఖ్‌కు ఉన్న అనారోగ్య సమస్యలను కూడా ప్రస్తావించారు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్