
ఏపీ మంత్రి అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి రచన చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు అంబటి రాంబాబు. ఆయన బ్రోలో శ్యామ్ బాబు క్యారెక్టర్ కి ఆయన బాగా హర్ట్ అయ్యారు. ఇప్పటికే బ్రో సినిమాలో తనను పోలిన క్యారెక్టర్ పెట్టి.. శునకానందం పొందుతున్నాడని పవన్ పై ఫైర్ అయిన రాంబాబు..అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్‌కు ఇచ్చిన రెమ్యూనరేషన్ మీద కూడా అంబటి తీవ్ర ఆరోపణలతో ఈడీ అధికారులను కలవడానికి ఢిల్లీ వెళ్తా అన్నారు. అయితే ఈ విషయమై అంబటికి ‘బ్రో’ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
మీడియావారు...‘బ్రో’ సినిమాకు సంబంధించి అంబటి చేసిన ఆరోపణలు.. ఈ సినిమా రైటర్ త్రివిక్రమ్ కి ఇచ్చిన వార్నింగ్ గురించి ఒక ఇంటర్వ్యూలో నిర్మాత విశ్వప్రసాద్‌ను అడగ్గా.. వీటిని తాను ఆరోపణలుగా భావించడం లేదని అన్నారు. వాటిని గాలి మాటలుగానే పరిగణించి లైట్ తీసుకుంటున్నానంటూ నవ్వేశారు. అలా కాకుండా తాను సీరియస్‌గా తీసుకుంటే మాత్రం కథ వేరుగా ఉంటుందని.. తనకు చాలా బలమైన లీగల్ టీం ఉందని.. ఆ మార్గంలో వెళ్తే అంబటిని కిందికి దించగలను (I’ll take him down) అని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. మరి ఈ విషయమై అంబటి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
కూల్‌గా మాట్లాడుతూనే అంబటికి మాస్ వార్నింగ్ ఇచ్చారంటూ విశ్వప్రసాద్‌పై పవన్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరో ఇంటర్వ్యూలో ‘బ్రో’ పెట్టుబడులు.. పవన్ రెమ్యూనరేషన్ గురించి అడిగితే.. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఒక న్యూస్ ఛానెల్ ప్రెజెంటర్‌కు విశ్వ ప్రసాద్ ఇచ్చిన కౌంటర్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి.
అలాగే బ్రోకి ఎంత ఖర్చయ్యింది? ఎంతొచ్చింది? పవన్‌కి ఎంతిచ్చారు? జీఎస్‌టీ కట్టారా, లేదా? ఇదీ… అంబటి రాయుడు బ్రో నిర్మాతపై సంధించిన ప్రశ్నలు. వీటికి నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ కూడా నేరుగా సమాధానం ఇచ్చేశారు. `ఈ లెక్కలు ఎవరికీ చెప్పాల్సిన అవసరం మాకు లేదు` అని ఒక్క మాటలో తేల్చేశారు. ఈ లెక్కలన్నీ జీ టీవీకీ తమకీ మధ్య ఉంటాయని, వాటిని ఎవరో అడిగారని, బయట పెట్టాల్సిన అవసరం లేదన్నారు. పవన్‌కి ఎంతిచ్చామన్నది కూడా అంతర్గత విషయమని, ఒకవేళ తన పారితోషికం ఎంతన్నది పవన్ తనకు తాను చెప్పుకొంటే అది పూర్తిగా ఆయన ఇష్టమన్నారు. తమకొచ్చిన మొత్తానికి జీఎస్‌టీ కట్టామని, ఇచ్చిన పారితోషికాలకూ జీఎస్‌టీ చెల్లించామని, చిత్ర రంగంలో సుదీర్ఘకాలం ఉండాలన్న ఆశయంతో వచ్చాం కాబట్టి, లెక్కా పత్రాలు పక్కాగా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. అంబటి ఆరోపణలు వాస్తవం కాదని, ఆయన గాల్లో లెక్కలు వేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.
ఇక బ్రో సినిమా డిజాస్టర్ అంటూ ఈ సినిమా కలెక్షన్ల వివరాలను ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు చదవటం మాత్రం అంతటా ట్రోలింగ్ మెటీరియల్ గా మారింది. పనిలో పనిగా.. బ్రో సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌పైనా ఆయన విమర్శలు గుప్పించారు. “ఆయనొక ఎన్నారై. అమెరికా నుంచి పవన్‌కు వస్తున్న డబ్బు పెద్ద స్కాం. పవన్‌కు ఇవ్వాల్సిన ప్యాకేజీని చంద్రబాబు ముఠా ఇలా తన మనిషి విశ్వప్రసాద్ ద్వారా అందిస్తున్నాడు” అని అంబటి కామెంట్స్ చేసారు.