ఆనంద్ దేవరకొండ - వైష్ణవి చైతన్య జంటగా నటించి చిత్రం ‘బేబీ’ ఈ నెలలోనే రిలీజ్ కానుంది. రోటీన్ కు భిన్నంగా వస్తున్న ప్రేమకథ ఇది. తాజాగా యూనిట్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయగా.. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. అయితే ఆ సినిమాలు హిట్టా.. ఫ్లాఫా అన్న విషయాలను పక్కనబెడితే రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తున్నారు. చివరిగా ‘పుష్పక విమానం’, ‘హైవే’ చిత్రాలతో అలరించాడు. ఇక ప్రస్తుతం ‘బేబీ Baby చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి పలు పోస్టర్లు, సాంగ్స్, టీజర్ విడుదలై ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా యూనిట్ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ను విడుదల చేసింది. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. యూత్ ఫుల్ కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఆనంద్, వైష్ణవి బ్యూటీఫుల్ గా కనిపిస్తున్నారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఓ పెంకుటింటిలోకి ఆనంద్ దేవరకొండ దేవదాస్ అవతార్ లో ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత స్కూల్ నుంచి పిల్లలు వెనుదిరిగి వెళ్తున్నట్టు గా ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత ‘మొదటి ప్రేమకి మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అనే లైన్స్ వస్తాయి. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది.
అయితే, స్కూళ్లో చిగురించిన ప్రేమ, ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమ కాలేజీకి వెళ్లాకా ఎలా మారుతుందనేది ట్రైలర్ లో చూపించారు. స్కూల్లో ప్రాణం కంటే ఎక్కువగా కలిసి వారిద్దరూ అసలు కాలేజీకి వెళ్లాక ఎందుకు మారిపోయారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ సమస్య అమ్మాయి మారడం వల్ల వస్తుంది. ఇంతకీ ఆమెను కాలేజీలో మార్చిన పరిస్థితులు ఏంటీ? ఎందుకు తను లవ్ చేసిన వాడికి దూరమైంది? ఇంతకీ వారు కలిశారా? లేదా? అనే అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక బ్యూటీఫుల్ మ్యూజిక్ తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇక ఇందులో కాస్తా అన్న ‘అర్జున్ రెడ్డి’ వెర్షన్ ను కూడా ఆనంద్ దేవరకొండ దించారు. దీంతో ట్రైలర్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఈ చిత్రంలో హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల నేషనల్ అవార్డ్ అందుకున్న సాయి రాజేష్ తదుపరి చిత్రం కావడం సినిమాకు ప్లస్. ఇప్పటికే షూటింగ్, ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగిసి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ట్రైలర్ తోనూ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. జూలై 14న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
Beauty, Pain & beyond 🔥
Here's the Trailer of Most Anticipated Film of the Season 🫶 👇https://t.co/mLuHpnHRpt
In theaters, July 14th 📣 pic.twitter.com/mK6T2yzGPQ