లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం నటిస్తున్నభారీ చిత్రం ‘జవాన్’. బాలీవుడ్ లో రూపుదిద్దుకుంటోంది. షారుఖ్ ఖాన్ సరసన నయన్ నటిస్తోంది. అయితే తాజాగా ఫస్ట్ లుక్ అంటూ ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్నేళ్లుగా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తోంది. గతేడాది తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సరోగసీ విధానం ద్వారా ఇద్దరు పిల్లలకూ తల్లిగా మారింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లోనూ నయనతార సినిమాలతో అలరించనుంది. ప్రస్తుతం నయనతార నటిస్తున్న భారీ చిత్రం ‘జవాన్’. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ సరసన నటిస్తోంది.
అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటికే అందించిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక తాజాగా చిత్రం నుంచి నయనతార ఫస్ట్ లుక్ లీకైందని, తన లుక్ ఇదేనంటూ ఓ ఫొటో అయితే నెట్టింట చక్కర్లు కొడుతోంది. పింక్ సూట్ లో నయనతార చాలా స్టైలిష్ గా, సూపర్ స్మార్ట్ గా కనిపిస్తున్నారు. దీంతో నయనతార చాలా పవర్ ఫుల్ రోల్ లో నటించబోతుందంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. చాలా కాలంగా నయన్ ఫ్యాన్స్ కు రాని కిక్క్ ఈ సినిమాతో అందనుందని ఆశిస్తున్నారు.
కాగా, ఆ ఫొటో ‘జవాన్’ లోని నయన్ లుక్ కాదని కూడా అంటున్నారు. అది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక మున్ముందు ‘జవాన్’ నుంచి నయనతారకు సంబంధించిన అప్డేట్ వస్తే గానీ ఇందులో వాస్తవం బయటపడేలా లేదు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) చివరిగా ‘పఠాన్’తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా హిందీలో మంచి రిజల్ట్ ను అందించిన చిత్రం ఇదే. ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ Jawanపై ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది.
మరోవైపు సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. చిత్రాన్ని రెడ్ చిల్లీస్ పతాకంపై షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ గ్రాండ్ గా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నయనతార నటిస్తుండటం మరింత అంచనాలను పెంచేస్తోంది. తాజాగా చిత్రం ట్రైలర్ పైనా ఓ న్యూస్ వైరల్ గా మారుతోంది. అలాగే 2 : 30 నిమిషాల నిడివిగల ట్రైలర్ కూడా రానుందని అంటున్నారు. చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగిబాబు నటిస్తున్నారు. విజయ్, సంజయ్ దత్, దీపికా పదుకొణె క్యామియో అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.