ఫస్ట్ లుక్: దొరసాని కోసం దేవరకొండ మొండిపట్టు!

Published : May 30, 2019, 12:29 PM ISTUpdated : May 30, 2019, 12:34 PM IST
ఫస్ట్ లుక్: దొరసాని కోసం దేవరకొండ మొండిపట్టు!

సారాంశం

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దొరసాని. రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. 

అయితే సినిమాకు సంబందించిన ప్రధాన తారాగణం యొక్క ఫస్ట్ లుక్ ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. పోస్టర్ లో ఇద్దరు కూడా ఆకర్షించే హావభావాలతో కనిపిస్తున్నారు. దొరసాని పాత్రలో శివాత్మిక నటించగా సాధారణ యువకుడిగా ఆనంద్ దేవరకొండ నటిస్తున్నాడు. దొరసాని కోసం సామాన్యుడైన హీరో తన మొండిపెట్టుతో అలనాటి పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమాలో మెయిన్ పాయింట్.  

జూన్ 6న సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. నిజ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా నరేంద్ర అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మధుర శ్రీధర్ - యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న దొరసాని సినిమా జులై 5న రిలీజ్ కానుంది. 

PREV
click me!

Recommended Stories

Renu Desai : నాకంటూ ఎవరు లేరు, ఎవరికి చెప్పుకోలేను, పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఎమోషనల్ కామెంట్స్
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‌కు 'నువ్వు నేను' సినిమాలో ఛాన్స్.. కుండబద్దలు కొట్టిన తేజ