అమృత ప్రణయ్ సంఘటనలతో సినిమా‌: వర్మకు ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్

By Satish ReddyFirst Published Jul 4, 2020, 2:55 PM IST
Highlights

ప్రణయ్‌ తండ్రి, అమృత మామ బాలస్వామి వర్మ తెరకెక్కిస్తున్న సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్నాడు బాలాస్వామి. ఈ మేరకు నల్గొండ ఎస్పీ ఎస్టీ కోర్టులో ఫిర్యాదు చేశాడు.

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఇటీవల మర్డర్ పేరుతో ఓ సినిమాను ప్రకంటించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసుకు సంబంధించి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. అయితే ఈ కథకు సంబంధించి అమృత ప్రణయ్‌ కుటుంబాలను సంప్రదించలేదని పూర్తి మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ కథను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ.

అయితే అప్పట్లో వర్మ సినిమాపై అమృత స్పందించినట్టుగా వార్తలు వచ్చినా.. తరువాత అమృత కుటుంబం ఆ వార్తలను ఖండించింది. అయితే తాజాగా ప్రణయ్‌ తండ్రి, అమృత మామ బాలస్వామి వర్మ తెరకెక్కిస్తున్న సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్నాడు బాలాస్వామి. ఈ మేరకు నల్గొండ ఎస్పీ ఎస్టీ కోర్టులో ఫిర్యాదు చేశాడు. స్పందించిన కోర్టు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులును ఆదేశించింది.

లాక్‌ డౌన్‌ సమయంలో దర్శకులంతా ఖాళీగా ఉంటే వర్మ మాత్రం వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్, నేక్ట్‌ లాంటి సినిమాలను రిలీజ్ చేసిన వర్మ మరో నాలుగైదు  సినిమాలను లైన్‌ పెట్టాడు. అయితే వీటిలో చాలా సినిమాలు వివాదాస్పద కథాంశాలే కావటం విశేషం.

click me!