ఎన్టీఆర్‌కు విలన్‌ గా మంచు మనోజ్.. నిజమెంత?

By Surya PrakashFirst Published Jul 4, 2020, 9:59 AM IST
Highlights

ఇప్పుడు మంచు మనోజ్ వంతు వచ్చిందంటున్నారు. ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా చెయ్యబోతున్నారంటూ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఏ సినిమాలో ఆయన నటించబోతున్నారు

మోహన్ బాబు.. మొదట్లో విలన్ గా సినిమాల్లో చేసి, ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్స్ ఇచ్చారు. ఆయన కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న సైతం... అనగనగా ఓ థీరుడు చిత్రంలో విలన్ గా చేసింది. ఇక ఇప్పుడు మంచు మనోజ్ వంతు వచ్చిందంటున్నారు. ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా చెయ్యబోతున్నారంటూ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఏ సినిమాలో ఆయన నటించబోతున్నారు. అందులో నిజానిజాలు ఏమిటి వంటి విషయాల్లోకి వెళితే..

అరవింద సమేత వీర రాఘవ వంటి సూపర్ హిట్  సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్,   త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, హారిక హాసిని క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి..  తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా మంచు మనోజ్ ని తీసుకునేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. 

స్క్రిప్టు పూర్తి చేసి, ప్రస్తుతం పాత్రల ఎంపికలో బిజీగా ఉన్న త్రివిక్రమ్ మంచు మనోజ్ ని విలన్ గా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడని చెప్తున్నారు...ఇక ఇదే విషయాన్ని ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావించగా ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపడంతో మనోజ్‌ను త్రివిక్రమ్ సంప్రదించారని  వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా మనోజ్ ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.. ఈ వార్త మీడియా వాళ్లు వండిందో , లేక నిజమో  తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు..
 
త్రివిక్రమ్ గత చిత్రం అల వైకుంఠపురంలో సుశాంత్ కి ఓ కీలక రోల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మనోజ్ ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మనోజ్ కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమాగా రాబోతోంది. ఇక ఎన్ టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో కనిపించబోతున్నారు. 

click me!
Last Updated Jul 4, 2020, 9:59 AM IST
click me!