రైతుల ప్రాణాలు కాపాడిన మెగాస్టార్.. దేవుడయ్యాడు!

By Prashanth MFirst Published Jun 13, 2019, 8:25 AM IST
Highlights

రైతుల కోసం బాధ్యతగా ఆలోచించే అతికొద్ది సినీ ప్రముఖుల్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒకరు. వందల కోట్ల సంపాదనలో ఒక వంతు రైతులకు అందిస్తే రైతుల ఆత్మహత్య అనేదే ఉండదని ఆలోచిస్తారు. 

రైతుల కోసం బాధ్యతగా ఆలోచించే అతికొద్ది సినీ ప్రముఖుల్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒకరు. వందల కోట్ల సంపాదనలో ఒక వంతు రైతులకు అందిస్తే రైతుల ఆత్మహత్య అనేదే ఉండదని ఆలోచిస్తారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే భరించలేకపోతున్నా అంటూ ప్రతి ఏడాది తాను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత వారి కోసం ఖర్చు చేస్తూనే ఉంటారు. 

రీసెంట్ గా మరికొంత మంచి రైతులను రుణ విముక్తుల్ని చేసి అభిమానుల్లో దేవుడయ్యాడు. కూతురు శ్వేతా బచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్ చేతుల మీదుగా బీహార్ కు చెందిన 2100 మంది రైతుల అప్పులను తీర్చారు. గతంలో ఉత్తరప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలకు చలించిపోయిన అమితాబ్ వెంటనే మరో రైతు చనిపోకూడదని బ్యాంకుల్లో ఉన్న అప్పులను ఏక మొత్తంగా కట్టేశారు. 

ఇక బీహార్ లో కూడా రైతులు ఆత్మహత్య చేసుకునే స్థితుల్లో ఉన్నారని ఇచ్చిన మాట ప్రకారం వారిని రుణ విముక్తుల్ని చేసి ప్రాణాల్ని నిలిపారు. అదే విధంగా పుల్వామా దాడిలో మరణించిన సైనికుల యొక్క కుటుంబాలను కూడా ఆదుకోవాల్సి ఉందని చెప్పిన అమితాబ్ త్వరలోనే వారికి కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పారు.   

click me!