అమితాబ్‌ బచ్చన్‌కి రెండోసారి కంటి ఆపరేషన్‌‌.. రిజల్ట్ ట్వీట్‌ చేసిన బిగ్‌బీ..

Published : Mar 15, 2021, 03:18 PM IST
అమితాబ్‌ బచ్చన్‌కి రెండోసారి కంటి ఆపరేషన్‌‌.. రిజల్ట్ ట్వీట్‌ చేసిన బిగ్‌బీ..

సారాంశం

తాజాగా అమితాబ్‌ తన ఆరోగ్య పరిస్థితిపై ట్వీట్‌ చేశారు. రెండో సారి కంటి ఆపరేషన్‌ సక్సెస్‌ అయినట్టు వెల్లడించారు. తనకు లేజర్‌ చికిత్స జరిగినట్టు అమితాబ్‌ వెల్లడించారు. ఇది వరకు ఓ కంటిలో శుక్లానికి సంబంధించి లేజర్‌ ట్రీట్‌మెంట్‌ జరిగింది. ఇప్పుడు మరో కంటికి కూడా చికిత్స పూర్తయ్యిందని చెప్పారు.   

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌కి రెండోసారి కంటి ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయ్యింది. ఆయన ఇటీవల ఆసుపత్రిలో చేరుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బిగ్‌బీకి ఏమైందో అని అభిమానులు ఆందోళన చెందారు. అయితే తాజాగా అమితాబ్‌ తన ఆరోగ్య పరిస్థితిపై ట్వీట్‌ చేశారు. రెండో సారి కంటి ఆపరేషన్‌ సక్సెస్‌ అయినట్టు వెల్లడించారు. తనకు లేజర్‌ చికిత్స జరిగినట్టు అమితాబ్‌ వెల్లడించారు. ఇది వరకు ఓ కంటిలో శుక్లానికి సంబంధించి లేజర్‌ ట్రీట్‌మెంట్‌ జరిగింది. ఇప్పుడు మరో కంటికి కూడా చికిత్స పూర్తయ్యిందని చెప్పారు.  

ఈ సందర్భంగా తనకు ఆపరేషన్‌ చేసిన హిమాన్షు మెహతాకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. `లైఫ్‌లో ఇదొక ఛాలెంజింగ్‌ విషయమని, త్వరలోనే తాను కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు చెప్పారు. గత కొన్ని రోజులుగా అమితాబ్‌ కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి చాలా రకాల ట్రీట్‌మెంట్లు తీసుకున్నా ప్రయోజనం లేదు. దీంతో లేజర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్‌ `మేడే`, `జుండ్‌`, తెలుగులో ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో రూపొందబోతున్న చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు వికాస్‌ బల్‌ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారట. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Prabhas ఇప్పుడు చేస్తున్నాడు, కానీ రజనీకాంత్‌ 20 ఏళ్ల క్రితమే చేశాడు.. ఆ మ్యాజిక్ వర్కౌట్‌ అయితే సంచలనమే
Illu Illalu Pillalu Today Episode Dec 31: నర్మదకు అసలు విషయం చెప్పేసిన అమూల్య, ఇక రప్పా రప్పే