ప్రాజెక్ట్ K పై స్పెషల్ ట్వీట్ చేసిన అమితాబ్, ఇంత పెద్ద సినిమా అనుకోలేదట..

Published : Jul 07, 2023, 12:17 PM IST
ప్రాజెక్ట్ K పై స్పెషల్ ట్వీట్ చేసిన అమితాబ్, ఇంత పెద్ద సినిమా అనుకోలేదట..

సారాంశం

తాను నటిస్తున్న సినిమా గురించే తనకే పూర్తిగా తెలియదు అంటున్నాడు ఇండియన్ సూపర్ స్టార్.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ప్రభాస్ ప్రాజెక్ట్ కె గురించి పెద్దాయన స్పెషల్ ట్వీట్ కూడా పెట్టాడు. 

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. దాదాపుగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో   వైజయంతి మూవీస్ బ్యానర్ పైఈ సినిమాను రూపొందిస్తున్నారు.  ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న  ప్రాజెక్ట్ K సినిమాలో దీపికా పడుకునే ప్రభాస్ జోడీగా నటిస్తుండగా.. అమితాబ్, కమల్ హాసన్  లాంటి ఉద్దండులు ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యారు.  సినిమాలో 

ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని పెంచుతూ.. మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.   ప్రాజెక్ట్ K సినిమా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో కామిక్ కాన్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఈ ఈవెంట్ లో పాల్గొనే మొదటి ఇండియన్ సినిమా ప్రాజెక్ట్ కేనే. ఈ విషయంలో మూవీ టీమ్ అంతా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. 

ఇక ఈ విషయంలో స్పందించారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్.  ఈ విషయం గురించి స్పెషల్ ట్వీట్ కూడా చేశారు బిగ్ బీ అమితాబ్. ఇది చాలా గర్వించదగ్గ విషయం... నేను ఇన్ని రోజులు ఈ సినిమా ఇంత పెద్దది, ఇంత ముఖ్యమైనది అనుకోలేదు. ఇప్పుడు నాకు తెలిసింది. వైజయంతి మూవీస్, డైరెక్టర్ నాగ్ సర్ కి, మొత్తం యూనిట్ కి నా మీద చూపించిన ప్రేమకు చాలా ధన్యవాదాలు. ఇంత గొప్ప సినిమాలో నేను భాగం అవ్వడం మర్చిపోలేని అనుభవం అని ట్వీట్ చేశారు అమితాబ్. 

 

ఇక అమితాబ్ ఇలా ట్వీట్ చేయడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ పొంగిపోతున్నారు. మరికొంత మంది మాత్రం.. మీకు ఈ విషయం ఇంతకు ముందు ఎందుకు తెలియదు.. మీరు కూడా ఈసినిమాలో నటిస్తున్నారుకదా.. సినిమా గొప్పతనం మీకు తెలికపోవడం ఏంటీ అని ఆడేసుకుంటున్నారు. అందర్జాతీయ సంస్థ గుర్తించిన సినిమా గొప్పతనాన్ని మనం కనిపెట్టలేకపోతున్నాం అన్నారు అమితాబ్.. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు