Aadavallu Meeku Joharlu:'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఓటిటి రిలీజ్ డేట్ !

Surya Prakash   | Asianet News
Published : Feb 09, 2022, 09:44 AM IST
Aadavallu Meeku Joharlu:'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఓటిటి  రిలీజ్ డేట్ !

సారాంశం

 దర్శకుడు కిశోర్ తిరుమల  దర్శకత్వంలో వచ్చిన 'నేను శైలజ' .. 'చిత్రలహరి' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సిద్ధమవుతోంది.

యంగ్ హీరో శ‌ర్మ‌నంద్ హీరోగా నేషన‌ల్ క్ర‌ష్ రష్మిక మంద‌న్నా హీరోయిన్ గా తాజా గా రూపొందుతున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు' . కిషోర్ తిరుమల ద‌ర్శ‌కత్వంలో ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్ గా తెర‌కెక్కుతోంది. ఇటీవ‌ల విడుద‌ల అయిన పోస్ట‌ర్ల తో పాటు ఒక పాట‌తో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. అలాగే ఎక్సపెక్టేషన్స్ కూడా అమాంతంగా పెరిగిపోయాయి. కాగా తాజాగా ఈ సినిమా గురించి చిత్ర టీమ్ విడుదత తేదీను అభిమానుల‌తో పంచుకుంది.  ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేస్తున్నారు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి వివరాలు బయిటకు వచ్చాయి.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా  ఓటిటి, శాటిలైట్ రైట్స్ ని సోనీ గ్రూప్  సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో సోనీ సంస్ద పూర్తి స్దాయిలో తెలుగులోకి ప్రవేశించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక  సోనీ గ్రూప్ అంటే తెలుగు ఓటిటి రైట్స్ SonyLIV తీసుకున్నట్లే. ఇందు నిమిత్తం 25 కోట్లు దాకా పెట్టినట్లు సమాచారం. శర్వానంద్ కెరీర్ లోనే ఇది పెద్ద మొత్తం అంటున్నారు.

ఇక ఓటిటి రిలీజ్ డేట్ విషయానికి వస్తే.. సాధారణంగా సోనీ లివ్ వెంటనే సినిమాలను స్ట్రీమ్ చేయటం లేదు. టైమ్ తీసుకుంటోంది. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన నెల తర్వాత ఓటిటి రిలీజ్ కు వెళ్తుంది.  ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు.

సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై శర్వానంద్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు.  శ‌ర్వ‌ానంద్ ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఫ్యామిలీ మూవీస్ చాలా హిట్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఆడ‌వాళ్లు మీకు జోహర్లు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద దుమ్ము లేపుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?