14ఏళ్ల వయసులో లైంగిక వేధింపులు...అతడు ఏమి చేస్తున్నాడో కూడా తెలిసేది కాదు అమీర్ ఖాన్ కూతురు షాకింగ్ వీడియో

Published : Nov 02, 2020, 07:25 PM IST
14ఏళ్ల వయసులో లైంగిక వేధింపులు...అతడు ఏమి చేస్తున్నాడో కూడా తెలిసేది కాదు అమీర్ ఖాన్ కూతురు షాకింగ్ వీడియో

సారాంశం

14ఏళ్ల వయసులో ఓ వ్యక్తి వలన ఐరా ఖాన్ లైంగిక వేధింపులకు గురయ్యారట. ఆ వయసులో ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడో కూడా తనకు తెలిసేది కాదట. ఒక ఏడాది తరువాత అతడి చెడ్డ ప్రవర్తన అర్థం చేసుకొని తల్లిదండ్రులు మెయిల్ పెట్టి ఆ సమస్య నుండి బయటపడ్డాను అని ఐరా తెలియజేశారు. ఆ విషయం కూడా తనను అంతగా మానసిక ఒత్తిడికి గురికాలేదని ఐరా తెలియజేసింది.   


స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె బాల్యం నుండి  తనకు ఎదురైన కొన్ని చేధు అనుభవాలు సోషల్ మీడియా ద్వారా చెప్పుకున్నారు. ఓ వీడియో సందేశం ద్వారా తాను ఎదుర్కున్న మానసిక ఇబ్బందుల గురించి ఆమె వివరించారు. అన్ని సౌకర్యాలు సంపదలు ఉన్నా, కొన్ని విషయాల వలన ఆమె మానసిక వేదనకు గురయ్యారట. వాటన్నింటి నుండి ఆమె మెల్లగా బయటపడినట్లు ఐరా ఖాన్ తెలియజేశారు. 

మూడేళ్ల క్రితం డిప్రెషన్ కి గురైన ఐరా ఖాన్ ఇంట్లో ఒంటరిగా ఓ గదిలో గడిపేది అట. అల కొన్నాళ్లు ఒంటరి జీవితం గడిపిన తరువాత దాని వలన ప్రయోజనం లేదని తెలుసుకుందట. ఇక ఐరా తల్లిదండ్రులు విడాకులు తీసుకొని విడిపోయినప్పుడు ఐరా చిన్న పిల్ల కావడంతో పెద్దగా ఒత్తిడికి గురి కాలేదట. ఐతే 14ఏళ్ల వయసులో ఓ వ్యక్తి వలన ఐరా ఖాన్ లైంగిక వేధింపులకు గురికావడం జరిగిదని చెప్పింది. 

ఆ వయసులో ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడో కూడా తనకు తెలిసేది కాదట. ఒక ఏడాది తరువాత అతడి చెడ్డ ప్రవర్తన అర్థం చేసుకొని తల్లిదండ్రులు మెయిల్ పెట్టి ఆ సమస్య నుండి బయటపడ్డాను అని ఐరా తెలియజేశారు. ఆ విషయం కూడా తనను అంతగా మానసిక ఒత్తిడికి గురికాలేదని ఐరా తెలియజేసింది. 1986లో అమీర్ ఖాన్ రీనా దత్తను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2002లో విడాకులు తీసుకొని విడిపోగా, పిల్లల సంరక్షణ బాధ్యత రీనా తీసుకోవడం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కాగా వారిలో ఐరా ఒకరు. 
 

PREV
click me!

Recommended Stories

Balakishna: `అఖండ 2` డిజాస్టర్‌ దెబ్బ.. బాలయ్య కొత్త సినిమాకి బడ్జెట్‌ కష్టాలు.. ఆగిపోయిందా?
ప్రభాస్ జోకర్ గెటప్ వెనుకున్న వ్యక్తి ఎవరంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్ మారుతీ